ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RGV: నేను పరారీలో లేను.. పోలీసుల విచారణపై వర్మ వితండవాదం

ABN, Publish Date - Nov 29 , 2024 | 01:44 PM

Andhrapradesh: సోషల్ మీడియాలో డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ వితండవాదం చేస్తున్నారు. ‘‘ఇది నాపై కేసు గురించి కాదు.. కానీ సరైన సమయం.. సంబందించిన వారందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నది ఏమిటి? అది ఎందుకు ఎక్కువ? దీన్ని ఎవరు ఎలా ఎక్కువ ఏది నిర్ణయిస్తారు?’’ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

Director Ramgopal Varma

అమరావతి, నవంబర్ 29: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Film Director Ramgopal Varma) రెండు సార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వర్మ... సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. తాజాగా పలు ఛానెల్స్‌కు ఇంటర్యూలు కూడా ఇస్తూ... తాను పరారీ లేనంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అలాగే పోలీసుల విచారణపై ఎక్స్ వేదికగా తనదైన రీతిలో వితండవాదం చేస్తున్నారు. పోలీసులు తన ఆఫీస్‌లోనికి రాలేదని, తాను తన డెన్‌లోనే ఉన్నానని.. అప్పుడప్పుడు షూటింగ్‌‌లకు వెళ్లొచ్చానని వర్మ చెప్పుకుంటున్నారు.

TG Govt: దిలావల్‌పూర్ ఇథనాల్ కంపెనీ ఎపిసోడ్.. విచారణలో విస్తుపోయే నిజాలు


వర్మ పోస్టు...

ఇది నా ఒక్కడి సమస్య కాదు అందరి సమస్య అంటూ పోస్టులు పెట్టిన వర్మ.. సమాజాన్ని ఉద్దరించే వాడిలా కవరింగ్‌లు ఇస్తున్న పరిస్థితి. ఏకంగా చట్టాలనే మార్చాలని ఆర్జీవీ అనడం విడ్డూరంగా ఉంది. ‘‘ఇది నాపై కేసు గురించి కాదు.. కానీ సరైన సమయం.. సంబందించిన వారందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నది ఏమిటి? అది ఎందుకు ఎక్కువ? దీన్ని ఎవరు ఎలా ఎక్కువ ఏది నిర్ణయిస్తారు? ప్రస్తుత చట్టాల అమలులో ఈ స్థిరమైన అసమానత, వివక్షకు బదులుగా తదనుగుణంగా చట్టాలను రూపొందించమంటూ’’ ఎక్స్‌లో పోస్టు చేసిన వర్మ... ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేశారు.


అయితే నేను పరారీలో లేను అని చెప్పుకుంటున్న వర్మ.. ‘‘ఒంగోలు పోలీసులు ఆఫీస్ బయట ఉన్నప్పుడు ఎందుకు తన మనుషులతో వర్మ ఎవరికి అందుబాటులో లేడని మీడియా ముఖంగా చెప్పాడు.. వర్మకు భయం లేదని.. వర్మ లాంటి వీఐపీ మీద పొలీసుల చేయి వేస్తే ..చూస్తూ ఊరుకుంటామా అంటూ అతని లీగల్ టీమ్ ఎలివేషన్స్ ఇచ్చింది. కోర్ట్‌లో వరుస పిటిషన్స్ వేయటం వెనుక రీజన్.. భయం కాక ఇంకేమనుకోవాలి..!! షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌లు ఉన్నందు వల్ల .. విచారణకు సమయం అడిగిన వర్మకు .. ఇంటర్యూ ఇచ్చేందుకు సరిపడా సమయం ఉందా.. ఇప్పటికే మార్ఫింగ్ ఫోటోలతో .. సిల్లీ పోస్ట్‌లతో వర్మ పరిధి ధాటి సోషల్ మీడియాలో తన సైకోయిజం చూపించాడు.. ఇప్పుడు చట్టం మీద గౌరవం లేకుండా , దేశ పౌరుడిగా బాధ్యత లేకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ వారిమీదే తిరిగి అబాండాలు వేసె స్థాయికి వచ్చేశాడు. వర్మకు తాను చేసింది తప్పని తెలిసి కూడా అనవసరమైన లాజిక్‌లకు పోతూ.. వ్యవహారాన్ని మరింత సీరియస్ గా మార్చుకుంటున్నాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్స్ పోస్ట్‌లతోనో.. వాటికి కొన్ని ఛానెల్ ట్యాగ్‌లతోనో.. పోలీసులను భయపెట్టాదామని చూస్తున్న వర్మకు అతనెక్కడున్నా ఏ అర్థరాత్రో వచ్చి ఎత్తుకెళ్లగలరనేది అర్థం కావట్లేదా’’ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది .

ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే.


కాగా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రెండు సార్లు పోలీసుల విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్‌ వర్మ విచారణను ఎదుర్కుంటున్నారు. దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయ్యింది. మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో టీడీపీ మండల కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈనెల 25న మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే రెండో సారి విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరుకావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్‌కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసుల విచారణకు రాని నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వెంటనే వర్మ నివాసానికి పోలీసులు చేరుకోగా.. ఆయన ఇంట్లో లేరని చెప్పడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి...

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

AP News: సత్యసాయి జిల్లాలో విషాదం..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 02:00 PM