ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్యూమరేషన్‌.. 90.57 శాతం పూర్తి

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:35 AM

వరద నష్టం అంచనాకు సంబంధించి నగరంలో చేపట్టిన ఎన్యూమరేషన్‌ 90.57 శాతం పూర్తయ్యింది. అయితే, విజయవాడ రూరల్‌ మండల పరిధిలో మాత్రం ఇంకా వరద నీరు ఉండటం వల్ల కేవలం 26.44 శాతం మాత్రమే జరిగింది. గురువారం నాటికి ఎన్యూమరేషన్‌ ప్రక్రియకు తుది గడువు కాగా, కొత్త గుర్తింపులు, సర్వేల వల్ల కొంత ఆలస్యమైంది.

నేడే తుది గడువు

నగరంలో 32 డివిజన్ల పరిధిలో 1,52,314 ఇళ్లకు సర్వే

ఇంకా 99,375 ఇళ్లకు పెండింగ్‌

విజయవాడ రూరల్‌ మండలంలో ఆలస్యం

మోకాలు లోతు నీరు ఉండటం వల్లే..

రెండు, మూడు రోజులు గడువు పెంచే అవకాశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వరద నష్టం అంచనాకు సంబంధించి నగరంలో చేపట్టిన ఎన్యూమరేషన్‌ 90.57 శాతం పూర్తయ్యింది. అయితే, విజయవాడ రూరల్‌ మండల పరిధిలో మాత్రం ఇంకా వరద నీరు ఉండటం వల్ల కేవలం 26.44 శాతం మాత్రమే జరిగింది. గురువారం నాటికి ఎన్యూమరేషన్‌ ప్రక్రియకు తుది గడువు కాగా, కొత్త గుర్తింపులు, సర్వేల వల్ల కొంత ఆలస్యమైంది. గురువారంతో గడువు ముగుస్తున్నప్పటికీ, పూర్తి చేయటానికి ఇంకో రెండు రోజులు పట్టే అవకాశముంది. నగరంలోని 32 డివిజన్లు, 286 సచివాలయాల పరిధిలో ఎన్యూమరేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 1,478 మంది రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక ఫ్లడ్‌ ఎన్యూమరేషన్‌ మొబైల్‌ యాప్‌లో ఇంటింటి సర్వే వివరాలను నమోదు చేశారు. విజయ వాడలో మొత్తం 1,68,176 మంది ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉండగా, బుధవారం సాయంత్రం నాటికి 1,52,314 ఇళ్లను పూర్తిచేశారు. మరో 99,375 కొత్త ఎన్యూమరేషన్లు కూడా నమోదు చేశారు. ఇక బుధవారం సాయంత్రానికి నగరంలో 2,524 వాణిజ్య సముదాయాల ఎన్యూమరేషన్లు జరిగాయి. నగరంలో డివిజన్‌ నెంబర్‌ 1, 5, 7, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 30, 32, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64లో ఏకకాలంలో ఎన్యూమరేషన్‌ నిర్వహిస్తున్నారు. వీటిలో నూరుశాతం పూర్తి చేసుకున్న వాటిలో 1, 5, 18, 20, 21, 22, 32, 40 డివిజన్లు ఉన్నాయి. ఇంటికి జరిగిన నష్టం, వ్యక్తిగత నష్టం, ప్రాణనష్టం, అవయవాల నష్టం, ధన నష్టం, వాహన నష్టం, ఇంటి వస్తువుల నష్టం ఇలా అన్నింటినీ అంచనా వేస్తున్నారు.

రూరల్‌ మండలంలో 26.44 శాతమే..

విజయవాడ రూరల్‌ మండలంలో మాత్రం ఆశించిన విధంగా ఎన్యూమరేషన్‌ జరగలేదు. ఇక్కడ ఇంకా నడుములోతు నీరు ఉండటం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. వరద నీరు పూర్తిగా తగ్గితే తప్ప ఇది సాధ్యం కాని పనిగా ఉంది. గురువారంతో ఎన్యూమరేషన్‌కు తుది గడువైనా రూరల్‌ మండలాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు, మూడు రోజులు గడువు పెంచే అవకాశం ఉంది. ఈ మండలంలో మొత్తం 32 గ్రామ సచివాలయాల పరిధిలో 119 మంది ఎన్యూమరేటర్లు సర్వే చేపడుతున్నారు. 19,780 ఇళ్లను సర్వే చేయాల్సి ఉండగా, బుధవారం సాయంత్రం నాటికి 5,423 పూర్తయ్యాయి. మరో 5,332 ఇళ్ల ఎన్యూమరేషన్‌ చేపట్టారు. వాణిజ్య సంబంధ ఎన్యూమరేషన్‌ తొమ్మిది మాత్రమే జరిగాయి.

Updated Date - Sep 12 , 2024 | 12:35 AM

Advertising
Advertising