68 లక్షల మంది విద్యార్థులకు ఉచిత వైద్యపరీక్షలు
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:05 AM
పటమట కోనేరు బసవయ్యచౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు.
‘బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష’ ప్రారంభంలో మంత్రి సత్యకుమార్‌యాదవ్
మొగల్రాజపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా 18 ఏళ్ల లోపు పిల్లల్లో 44 ఆరోగ్య సమస్య లను గుర్తించి వారికి పరీక్షలు చేసి, ఉచిత చికిత్స అందిస్తాం. రాష్ట్రవ్యా ప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 68 లక్షల మంది విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. చిన్నతనం లోనే పిల్లల్లో వ్యాధులు, లోపాలను గుర్తించి సత్వర చికిత్స అందించి ఆరో గ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం.’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపుని చ్చారు. పటమట కోనేరు బసవయ్యచౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో శుక్రవారం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ద్వారా 639 భవిత సెంటర్ల ద్వారా పిల్లల్లో గ్రహణమొర్రి, కంటి, గుండె సం బంధిత వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తామని మంత్రి తెలిపారు. బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను విడు దల చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, పాఠశాల విద్యా డైరెక్టర్ వి.విజ య్‌రామరాజు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:05 AM