వైభవంగా గిరి ప్రదక్షిణ
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:10 AM
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వ హించిన గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల గిరి ప్రదక్షిణ ఆద్యంతం భక్తి పారవ శ్యంతో వైభవంగా సాగింది.
వన్‌టౌన్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వ హించిన గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల గిరి ప్రదక్షిణ ఆద్యంతం భక్తి పారవ శ్యంతో వైభవంగా సాగింది. మహిళా భక్తుల లలితా సహస్రనామ పారాయణం, జై దుర్గ, జైజై దుర్గ నినాదాలు, మంగళవాయిద్యాలు, జయజయ ధ్వానాల మధ్య 8 కిలోమీటర్ల పొడ వునా గిరి ప్రదక్షిణ కొనసాగింది. మార్గం మధ్యలో భక్తులు పసుపు జలాల వారు పోసి, టెంకాయలు కొట్టి, పూలు, పండ్లు, హారతులు సమర్పించారు. దుర్గగుడి ఘాట్‌రోడ్డు టోల్‌గేట్ వద్ద ఉత్సవమూర్తులకు లఘుపూజ చేశాక, ఈవో రామారావు దంపతులు, ముఖ్య అర్చ కుడు శ్రీనివాసశాస్త్రి కొబ్బరికాయల బలిహరణలు ఇచ్చారు. ఉత్సవమూర్తులు కొలువైన ప్రత్యేక వాహనాన్ని ఈవో దంపతులు, ముఖ్య అర్చకులు భక్తులు లాగారు. కార్తీక పౌర్ణమి, శుక్రవారం దృష్ట్యా లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమం పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గగుడిలో అన్నవితరణ నిమిత్తం శుక్రవారం గుం టూరు జిల్లా తుళ్లూరుకు చెందిన దామినేని హర్ష, విజయవాడ మాచవరం ప్రాంతంలోని గులాం మొహీద్దీన్‌నగర్‌కు చెందిన అవాల సూర్యారావు, ఆయన కుటుంబ సభ్యులు రూ.లక్ష చొప్పున విరాళం ఇచ్చారు. దుర్గమ్మను మహిళా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కొల్లా లలితకుమారి దర్శించుకున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:10 AM