ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాధితులకు అండగా ప్రభుత్వం

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:19 AM

వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ అన్నారు.

గాజులపేటలో బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 11: వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ అన్నారు. గాజులపేట జాకీర్‌హుస్సేన్‌ కళాశాల రోడ్డు, ప్రసాద్‌ నగర్‌లోని వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. జూపూడి, కిలేశపురం గ్రామాల్లో పశు పోషకులకు పశువుల దాణా, పశుగ్రాసాన్ని అందించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

వీరులపాడు: పెద్దాపురంలో ఏనుగుగడ్డ వాగు ఉధృతికి పడిన గండితో వారం పైగా నిలిచిపోయిన రాకపోకలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు బుధవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దగ్గరుండి గండిని పూడ్చే పనిని పర్యవేక్షించారు. కార్యక్రమంలో దాములూరు మధుసూదన్‌రావు, కొండ్రుగుంట శ్రీనివాస్‌ కుమార్‌, పసుపులేటి పుల్లారావు, బలుసుపాటి బాబురావు పాల్గొన్నారు.

అల్లూరు, జుజ్జూరు, వెల్లంకి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను, రోడ్లను, ఇళ్లను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. పంట నష్ట పోయిన రైతులను, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గురువారం నుంచి బాధితులకు నిత్యావసరాలు అందిస్తామన్నారు.

పెనుగంచిప్రోలు : నియోజకవర్గంలోని రైతాంగానికి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ అన్నారు. పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే, అధికారులు, స్థానిక నేతలతో కలసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం గురించి ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించినట్టు తెలిపారు. ఎంపీ కేశినేని చిన్నితో కలిసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మండల పార్టీ అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య, వేగినేటి గోపాల కృష్ణమూర్తి, కర్ల వెంకట నారాయణ, సుంచు రమేష్‌, కర్ల నాగేశ్వరరావు, నూతలపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:20 AM

Advertising
Advertising