ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra: దుర్గమ్మకు హంస వాహన సేవ రద్దు

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:29 PM

దసరా చివరి రోజు దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా కైంకర్యాలను దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు. అందుకోసం దేవాదాయ శాఖతోపాటు నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టారు. ప్రతి ఏడాది దసరా చివరి రోజు... కృష్ణనదిలో అమ్మవారు జల విహారం చేస్తారు.

విజయవాడ, అక్టోబర్ 11: దసరా నవరాత్రులు శనివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు నిర్వహించే దుర్గమ్మ వారి హంస వాహనం సేవను ప్రభుత్వం రద్దు చేసింది. అమ్మవారి జలవిహారం రద్దు కావడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కృష్ణా నదిలో నీటి ప్రవాహ స్థాయి అధికంగా ఉంది. అలాగే ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 40 క్యూసెకుల వరద నీరు నదిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ వారి జల విహారాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

AlsoRead: హీరో నాగార్జున, కొండ సురేఖ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్


దాంతో దసరా చివరి రోజు దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా కైంకర్యాలను దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు. అందుకోసం దేవాదాయ శాఖతోపాటు నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టారు. ప్రతి ఏడాది దసరా చివరి రోజు... కృష్ణానదిలో అమ్మవారు జల విహారం చేస్తారు.

Also Read: టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక


కన్నుల పండువగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మ వారి భక్తులు భారీగా విజయవాడ చేరుకునేవారు. అయితే కృష్ణా నదిలో నీటి ప్రవాహం కారణంగా ఈ ఏడాది అమ్మ వారి జలవిహారాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..


అదీకాక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా విజయవాడకు వరద నీరు పోటెత్తింది. దీంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సహాయక చర్యలు చేపట్టింది. దీంతో కొద్ది రోజుల్లోనే విజయవాడకు వరద ముంపు నుంచి ఉపశమనం లభించినట్లు అయింది.

Also Read: దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం

Also Read: నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు


ఈ వరద కారణంగా విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలుపు మేరకు టాలీవుడ్ పరిశ్రమలోని పెద్దలతోపాటు ప్రజలు సైతం భారీగా కదిలి వచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వరద నష్టంపై అంచనా వేసి నిధులను తక్షణ చర్యల్లో భాగంగా విడుదల చేసింది. ఇంకోవైపు విజయవాడలోని కృష్ణా నదిలో వరద ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా నదిలో అమ్మవారికి హంస వాహన సేవను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?

Also Read: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే


అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన శరన్నవరాత్రులు శనివారంతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ అలంకరాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం మహిషాసురమర్ధిని రూపంలో.. శనివారం శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 11 , 2024 | 05:02 PM