ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: విజయవాడలో ఎక్కడిక్కడ నిలిచిన వాహనాలు.. కారణమిదే

ABN, Publish Date - Dec 13 , 2024 | 11:52 AM

Andhrapradesh: విజయవాడలో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ @2047 ఆవిష్కరణ కార్యక్రమం నేడు (శుక్రవారం) జరుగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడిక్కడ వాహనాలను మళ్లించారు.

Vijayawada Traffic jam

అమరావతి, డిసెంబర్ 13: విజయవాడలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు (శుక్రవారం) బందర్ రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ @2047 ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడిక్కడ వాహనాలను మళ్లించారు.

భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!


మరోవైపు ఈ సమావేశానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 670 బస్సుల్లో ప్రజానీకాన్ని తరలిస్తున్నారు. డ్వాక్రా , మెప్మా, మహిళలు, ఎంఎస్‌ఎంఈలకు చెందిన వారిని బస్సుల్లో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈకార్యక్రమానికి సుమారు 2000 కార్లు వస్తాయని పోలీసులు అంచనా వేశారు. దీంతో 24 పార్కింగ్ ప్రదేశాలకు వాహనాలు తరలింపు చేపట్టారు. విజయవాడలోకి భారీ వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. బందర్ రోడ్డులోకి సదస్సుకు వెళ్ళే వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గమ్మ వారధి నుంచి విజయవాడకు వచ్చే ప్రదేశంలో బందర్ రోడ్డులోకి వెళ్ళే ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో మహిళలు.. పార్కింగ్ ప్రదేశాల నుంచి బందర్ రోడ్డు లోని ఇందిరాగాంధీ స్టేడియంకు నడుచుకుంటూ వెళ్తున్నారు.


ట్రాఫిక్ ఆంక్షలు అమలు...

స్వర్ణాంధ్ర విజన్‌–2047 సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఉదయం 5 నుంచి నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

  • హైదరాబాద్‌–విశాఖపట్నం–హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మార్గంలో వెళ్లాలి.

  • విశాఖపట్నం–చెన్నై–విశాఖపట్నం వైపు రాకపోకలు సాగించే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌, గుడివాడ, పామర్రు, అవని గడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు.

  • గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు బుండపాడు, తెనాలి, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్‌, పెనుమూడి బ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

  • చెన్నై–హైదరాబాద్‌–చెన్నై వైపు వాహనరాలు మేదరమెట్ల, అద్దండి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదు వెళ్లాలి.

  • విశాఖపట్నం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్‌, గుణదల, బీఆర్టీఎస్‌ రోడ్డు, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి, పీసీఆర్‌ జంక్షన్‌ మీదుగా పీఎన్‌బీఎస్‌కు వెళ్లాలి.

  • మచిలీపట్నం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఆటోనగర్‌ గేటు, బెంజ్‌సర్కిల్‌, మహానాడు జంక్షన్‌, రామవరప్పాడు, ఏలూరు రోడ్డు, గుణదల, చుట్టుగుంట, దీప్తి జంక్షన్‌, అప్సర జంక్షన్‌, పీసీఆర్‌ మీదుగా పీఎన్‌బీఎస్‌కు వెళ్లాలి.

  • పీఎన్‌బీఎస్‌ నుంచి విశాఖ వైపు వెళ్లే బస్సులు పీసీఆర్‌ జంక్షన్‌, ఆర్టీసీ వై జంక్షన్‌, చల్లపల్లి బంగ్లా, హనుమాన్‌పేట, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్‌ రోడ్డు, గుణదల, రామవరప్పాడు నుంచి వెళ్లాలి.

  • పీఎన్‌బీఎస్‌ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే బస్సులు పీసీఆర్‌, ఆర్టీసీ వై జంక్షన్‌, చల్లపల్లి బంగ్లా, విజయ టాకీస్‌, దీప్తి జంక్షన్‌, గుట్టుగుం ట, మాచవరం, పడవలరేవు జంక్షన్‌, గుణదల, రామవరప్పాడు రిం గ్‌, ఎనికేపాడు జంక్షన్‌, తాడిగడప 100 అడుగులు రోడ్డు మీదుగా వెళ్లాలి.

  • బెంజ్‌సర్కిల్‌ నుంచి ఎంజీ రోడ్డులో వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు మహానాడు, రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు, గుణదల, చుట్టుగుంట, దీప్తి జంక్షన్‌, అప్సర జంక్షన్‌, పీసీఆర్‌ జంక్షన్‌ నుంచి వెళ్లాలి.

  • ఎంజీ రోడ్డులో ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆటోలు, ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

  • బెంజ్‌సర్కిల్‌ నుంచి సీపీఆర్‌ మధ్యలో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యక్రమానికి వచ్చే వాహనాలను తప్ప ఇతర వాహనాలను అనుమతించరు.

  • సీతారామపురం జంక్షన్‌ నుంచి ఆర్టీఏ జంక్షన్‌ వరకు ఈట్‌స్ట్రీట్‌ వైపు స్వర్ణాంధ్ర విజన్‌కు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

  • శిఖామణి సెంటర్‌ నుంచి చుట్టుగుంట వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు.

వాహనాల పార్కింగ్‌ ఇలా..

  • స్వర్ణాంధ్ర విజన్‌–2047 కార్యక్రమానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ, ప్రముఖులు, అధికారులు, మీడియా తదితర వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 24 ప్రదేశాలను ఎంపిక చేశారు.

  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌ల వాహనాలను స్టేడియం వెనుక వైపు గేట్‌ నంబరు2, 4 వద్ద నిలుపుకోవాలి.

  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల వాహనానలు బిషప్‌ అజరయ్య స్కూల్‌ ప్రాంగణంలో నిలుపుకోవాలి.

  • వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రముఖ వ్యక్తుల వాహనాలను వజ్ర గ్రౌండ్‌, సిద్ధార్థ మహిళా కళాశాల, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేసుకోవాలి.

  • మీడియాకు సంబంధించిన వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం వెనుక వైపు ఉన్న గ్రౌండ్‌లో నిలుపుదల చేయాలి.

  • వివిధ జిల్లాల నుంచి వచ్చే అధికారుల వాహనాలను సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయం, స్టేట్‌గెస్ట్‌హౌస్‌ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిలుపుదల చేయాలి

  • అగ్రికల్చర్‌, టూరిజం, కల్చర్‌, ఎన్జీవో, హెల్త్‌కేర్‌, ఎస్‌హెచ్‌జీ, వెల్ఫేర్‌ విభాగాల నుంచి వచ్చే వాహనాలను బీఆర్టీఎస్‌ రోడ్డులో నిలుపుకోవాలి.

  • హెల్త్‌కేర్‌, వీఐపీ ఇండస్ట్రీ, ఎంఎస్‌ఎంఈ, ఐటీ విభాగాల నుంచి వచ్చే వాహనాలను ఎంజీ రోడ్డులోని డీసీపీ బంగ్లా ఎదురుగా ఉన్న పార్ధసారథి ప్రాంగణంలో నిలుపుదల చేయాలి.

  • విద్యారంగానికి సంబంధించి వాహనాలను ఆర్‌అండ్‌బీ ఆఫీసు ప్రాంగణంలో నిలుపుదల చేయాలి.

  • ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చే ప్రజలు, కార్యకర్తల వాహనానలు విశాలాంధ్ర రోడ్డులో ఉన్న శాతవాహన కళాశాల గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేయాలి.

  • కృష్ణాజిల్లా నుంచి వచ్చే వాహనాలను సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణం, ఎన్టీఆర్‌ జిల్లా నుంచి వచ్చే వాహనాలను ఆంధ్రా లయోల కళాశాల ప్రాంగణం 1లో నిలుపుదల చేయాలి.

  • రాయలసీమ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ఆంధ్రా లయోలా కళాశాల గ్రౌండ్‌–2లో పార్కింగ్‌ చేయాలి.

  • పాసులు ఉన్న వారు, పారిశ్రామికవేత్తలు, ఎంఎల్‌ఎస్‌ విభాగాలకు చెందిన వాహనాలు స్టేడియం లోపల పార్కింగ్‌ చేయాలి.

  • పోలీసుశాఖ వాహనాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రాంగణంలో పార్కింగ్‌ చేయాలి.

  • ప్రజలు, కార్యకర్తల వాహనాలను సీఎస్‌ఐ చర్చి, లయోలా కాలేజీ దేవయ్య ఆడిటోరిం, సిద్ధార్థ ఆడిటోరియం వద్ద నిలుపుదల చేయాలి.


ఇవి కూడా చదవండి..

పుష్ప సినిమా సీన్‌ను మించి స్కెచ్.. పోలీసులే షాక్..

సోది చెబుతానమ్మ..సోది..!

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 12:23 PM