ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోటారు సైకిళ్ల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:38 AM

మోటారు సైకిళ్ల చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్‌ క్రైం ఏడీసీపీ రాజారావు తెలిపారు.

నిందితుడిని మీడియా ఎదుట హాజరు పరిచిన క్రైం ఏడీసీపీ రాజారావు, సీఐ

మోటారు సైకిళ్ల చోరీ కేసులో

నిందితుడి అరెస్టు

మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

గుణదల, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): మోటారు సైకిళ్ల చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్‌ క్రైం ఏడీసీపీ రాజారావు తెలిపారు. గుణదల పోలీస్‌ స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో మోటారు సైకిళ్ల చోరీలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీసీఎస్‌, గుణదల పోలీసులు సంయుక్తంగా టీమ్‌లుగా ఏర్పడి నేరస్తులపై డేగకన్ను వేసినట్లు తెలిపారు. మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న చింతపల్లి సాయి కిరణ్‌(19)ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిందని చెప్పారు. చింతపల్లి సాయి కిరణ్‌ గిరిపురంలో ఉంటున్నట్లుగా గుర్తించి అతని వద్దనుంచి గుణదల, మాచవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చోరీ చేసిన మూడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్‌ సీఐ లక్ష్మినారాయణ, గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:38 AM