AP News: ఆ చట్టంతో వైద్యులపై దాడులను అరికట్టాలి: నందకిషోర్
ABN, Publish Date - Dec 06 , 2024 | 02:38 PM
Andhrapradesh: ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న అక్కడ ప్రజల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో తమ సభ్యులు ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు క్యాన్సర్ , రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులు పెరిగిపోతున్నాయన్నారు.
విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ శాఖకు 22 వేల మందికిపైగా సభ్యులు ఉన్నారని.. 26 జిల్లాలలో 99 శాఖలు ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ఐఎంఏ కనీసం నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
Komatireddy: సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. సినిమాలపై కోమటిరెడ్డి సంచలన నిర్ణయం
ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న అక్కడ ప్రజల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో తమ సభ్యులు ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు క్యాన్సర్ , రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులు పెరిగిపోతున్నాయన్నారు. అలాగే మన దేశంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎం.ఆర్) ప్రమాదం పొంచి ఉందన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో అంటు వ్యాధుల నుంచి ప్రజల్ని రక్షించటం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడటమే అందుకు కారణమని చెప్పుకొచ్చారు.
మోతాదు ప్రకారం మందులు వాడకపోతే యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్‌కు దారితీస్తుందన్నారు. ఇప్పటికే ఈ రెసిస్టెన్స్ కారణంగా క్షయ వ్యాధిని నిర్మూలించలేకపోతున్నమన్నారు. రాష్ట్రంలోని ఫార్మసీలలో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, అసిస్టెంట్లను ఏఎంఆర్‌పై శాస్త్రి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని విషయాలలో వైద్యులకు సహకారం అవసరమని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్తు చార్జీలు కమర్షియల్‌గా వేయడం, బిల్డింగ్ ఆస్తిపన్నులలో, మందులపై, వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గించటం ద్వారా వైద్యాన్ని భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైద్యులు అన్ని వ్యాధులను, యాక్సిడెంట్లో రోగులను అన్ని సందర్భాల్లో బతికించడం సాధ్యం కాదన్నారు. అనివార్య కారణాల వల్ల వ్యాధితో ఉన్న పేషెంట్ చనిపోతే డాక్టర్లపై దాడులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఒక చట్టం తీసుకు వచ్చిందని.. ఆ చట్టంలో ప్రస్తుతం మరికొన్ని మార్పులు చేసి కఠినంగా అమలు చేయడం ద్వారా వైద్యులపై దాడులను అరికట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 06 , 2024 | 02:38 PM