ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం

ABN, Publish Date - Jul 27 , 2024 | 01:20 AM

కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఎం ఆరోపించింది. అన్యాయంపై పోరాడేం దుకు టీడీపీ ముందుకు రావాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది.

లెనిన్‌సెంటర్‌లో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

పోరాటానికి టీడీపీ ముందుకు రావాలి: సీపీఎం

గవర్నర్‌పేట, జూలై 26: కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఎం ఆరోపించింది. అన్యాయంపై పోరాడేం దుకు టీడీపీ ముందుకు రావాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా సీపీఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు అధ్యక్షతన ఆ పార్టీ నాయకులు శుక్రవారం లెనిన్‌సెంటర్‌లో నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ‘‘రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పుగా కాకుండా రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి. విభజన హామీల అమలుకు నిధులు కేటాయిం చాలి. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ డౌన్‌, డౌన్‌’’ అంటూ సీపీఎం నాయకులు నినా దాలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని, అందుకు సీపీఎం సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించలే దని, సామాన్యులపై భారాలు వేసి, కార్పొరేట్లకు వరాలు ప్రకటించారని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూ రావు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌, నేతలు కె.దుర్గా రావు, టి.ప్రవీణ్‌, పి.కృష్ణ, మురహరి, పి.చంద్రశేఖర్‌, వి.గురుమూర్తి, కె.రమణ, వై.సుబ్బారావు, బోయి సత్తిబాబు ప్రసంగించారు.

Updated Date - Jul 27 , 2024 | 01:20 AM

Advertising
Advertising
<