ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల్లో సృజనాత్మకతకు స్ఫూర్తి2కే 24

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:41 AM

నేటి సమాజానికి అనుగుణంగా కళాశాలలో నిర్వహించే స్ఫూర్తి కార్యక్రమాలు విద్యార్థుల్లోని కళను వెలికి తీస్తాయని ప్రముఖ రచయిత బండి స్టాన్లీ తెలిపారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతకు స్ఫూర్తి2కే 24

ప్రముఖ రచయిత బండి స్టాన్లీ

భారతీనగర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నేటి సమాజానికి అనుగుణంగా కళాశాలలో నిర్వహించే స్ఫూర్తి కార్యక్రమాలు విద్యార్థుల్లోని కళను వెలికి తీస్తాయని ప్రముఖ రచయిత బండి స్టాన్లీ తెలిపారు. ఆంధ్రా లయోలా కళాశాలలో స్ఫూర్తి 2కె 24 కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కళ విద్యార్థుల్లోని బాహ్యరూపాన్ని కాకుండా అంతర్గత రూపాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ కిరణ్‌కుమార్‌, ఫాదర్‌ ప్రభుదాస్‌, డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ భార్గవి, విజువల్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి రాయప్ప, స్టూడెంట్‌ యాక్టివిటీస్‌ డీన్‌ డాక్టర్‌ ఎల్‌ శుభ, 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:41 AM