AP Politics: నేటి రాజకీయాల్లో కుల తత్వం, మతతత్వం ఆవహించింది: జయప్రకాష్ నారాయణ
ABN, Publish Date - Feb 12 , 2024 | 09:19 PM
టి రాజకీయాల్లో కుల తత్వం, జడతత్వం, మతతత్వం చాలా మందిలో ఆవహించిందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) అన్నారు.
విజయవాడ: నేటి రాజకీయాల్లో కుల తత్వం, జడతత్వం, మతతత్వం చాలా మందిలో ఆవహించిందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య 50సంవత్సరాల వృత్తి విరామ అభినందన సత్కార సభ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ యన్వీ రమణ, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, వివిధ రంగాలకు చెందిన పలువురు వైద్యులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. 27 ఏళ్లుగా తాను డాక్టర్ పట్టాభిరామయ్య కు సహచరుడినినని తెలిపారు. కొద్దిమందే జీవితంలో అపారమైన ప్రభావం చూపుతారని... అలాంటి వ్యక్తుల్లో పట్టాభిరామయ్య కూడా ఉన్నారని చెప్పారు.
ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్థిత ప్రజ్ఞత ఆయనలో ఉంటుందన్నారు. ఆయన కోరుకుంటే ఎలాంటి పదవి అయినా దక్కేదని అన్నారు. సమాజానికి సేవ చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సమాజ హితం కోసం, సామాన్యుల ఎదుగుదల కోసం పరి తపించారని అన్నారు. యువ వైద్యులకు మెలకువలు నేర్పి ఖండాంతరాలు దాటి ఖ్యాతి గడించేలా చేశారన్నారు. పరిపూర్ణమైన జీవితం చూసిన వ్యక్తి పట్టాభిరామయ్య అని తెలిపారు. వృతిరీత్యా విశ్రాంతి తీసుకుంటున్నానని అని చెప్పారు. 78 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంతో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మంచి వాతావరణం ఉండేదన్నారు. మంచి కన్నా చెడు పరుగులు పెడుతుందన్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు ద్వారా స్ఫూర్తి పొందాలని జయప్రకాష్ నారాయణ తెలిపారు.
Updated Date - Feb 12 , 2024 | 09:19 PM