PAC Election: పీఏసీ ఎన్నికలో ఎన్డీఏ పక్షాల కీలక నిర్ణయం
ABN, Publish Date - Nov 21 , 2024 | 03:44 PM
Andhrapradesh: పీఏసీలో ఉండాల్సిన సభ్యులకంటే ఒక నామినేషన్ ఎక్కువ దాఖలు కావటంతో పీఏసీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ నుంచి 9 మంది, వైసీపీ నుంచి ఒకటి కలిపి మొత్తం 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బలం అవసరం. కానీ నామినేషన్ దాఖలు చేసిన వైసీపీకి ప్రస్తుతం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు.
అమరావతి, నవంబర్ 21: పీఏసీ ఎన్నికపై (PAC Election) ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి. పీఏసీ సభ్యత్వానికి ఎన్డీఏ తరపున తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ వేశారు. తొమ్మిది నామినేషన్‌లు మాత్రమే దాఖలైతే పీఏసీ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం కానుంది. పీఏసీలో ఉండాల్సిన సభ్యులకంటే ఒక నామినేషన్ ఎక్కువ దాఖలు కావటంతో పీఏసీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ నుంచి 9 మంది, వైసీపీ నుంచి ఒకటి కలిపి మొత్తం 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బలం అవసరం. కానీ నామినేషన్ దాఖలు చేసిన వైసీపీకి ప్రస్తుతం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు.
AP Assembly: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
అయితే తొమ్మిది మంది సభ్యులు పీఏసీకి ఎన్నికై వెళ్తారు. తరువాత ప్రతిపక్షం నుంచి ఎవరైనా సభ్యుడు వస్తే అతడికి చైర్మన్‌గా నిర్ణయించి బాధ్యతలు అప్పచెబు తారు. కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి తొమ్మిది మంది.. వైసీపీ నుంచి ఒకరు నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 19.44 ఓట్లు రావాల్సి ఉంది. అంటే సుమారు 20 ఓట్లు అవసరం అవుతాయి. అయితే ఇప్పుడు వైసీపీ వద్ద ఉన్న సంఖ్యాబలం కేవలం 11 మాత్రమే కావడంతో వైసీపీ నుంచి సభ్యుడు ఎన్నిక కాని పక్షంలో.. మొత్తం కూటమి నుంచి పీఏసీకి ఎన్నికయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ తొమ్మిది మందిలో పీఏసీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం.. పీఏసీ ఎన్నికకు ఉన్న సంఖ్యాబలం కంటే ఒక నామినేషన్ అధికంగా పడింది. ఎన్డీఏ నుంచి తొమ్మిది, వైసీపీ నుంచి ఒకటి కలిపి మొత్తం పది నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి 20 సభ్యులు అవసరం. అయితే వైసీపీ సంఖ్యాబలం 11 మాత్రమే కావడంతో ఇప్పుడు ఎన్నిక రసవత్తరంగా మారింది. వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం పీఏసీ చైర్మన్ అయ్యే అవకాశం లేనందున.. కూటమి నుంచి వచ్చిన తొమ్మిది మంది సభ్యుల్లోనే ఒకరికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వారికి 23 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అప్పట్లో పయ్యావుల కేశవ్‌ను పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈసారి వైసీపీకి సంఖ్యాబలం లేనందున వారి సభ్యుడు పీఏసీలో సభ్యుడిగా నామినేషన్ వేసినప్పటికీ ఆయన ఎన్నిక కావడమే కష్టంగా భావించవచ్చు.
ఇవి కూడా చదవండి...
Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి
షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు
Read latest AP News And Telugu News
Updated Date - Nov 21 , 2024 | 03:49 PM