ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా కోనేరు హంపి, జ్యోతిసురేఖ, డాక్టర్ సమరం
ABN, Publish Date - Mar 30 , 2024 | 01:59 AM
ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల స్టార్ క్యాంపెయి నర్లుగా విజయవాడకు చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణిలు, ఒక డాక్టర్ కమ్ సెక్సాలజిస్ట్‌ను స్టార్ క్యాంపెయినర్లుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎంపిక చేసిం ది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల స్టార్ క్యాంపెయి నర్లుగా విజయవాడకు చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణిలు, ఒక డాక్టర్ కమ్ సెక్సాలజిస్ట్‌ను స్టార్ క్యాంపెయినర్లుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎంపిక చేసిం ది. చదరంగంలో విజయవాడ కీర్తిపతాకను ప్రపంచస్థాయిలో ఇనుమడింపచేసిన కోనేరు హంపి, ఆర్చరీలో ప్రపంచాన్నే శాసించిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రముఖ వైద్యుడు, సెక్సాలజిస్ట్, సామాజికవేత్త డాక్టర్ జి.సమరంను ఎంపిక చేశారు. వీరు తమతమ రంగాల్లో సెలబ్రిటీలు కావడంతో వీరి సోషల్‌మీడియా ఖాతాలకు లక్షల సంఖ్యలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నికలు ముగిసేవరకు వీరంతా ఓటింగ్ పెంచడానికి వీలైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యక్ష కార్యక్ర మాల్లోనూ పాల్గొంటారు. తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్టింగుల ద్వారా కూడా ప్రచారాన్ని కల్పిస్తారు.
Updated Date - Mar 30 , 2024 | 08:35 AM