ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎల్‌పీఎం గుదిబండ!

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:25 AM

శాశ్వత భూహక్కులు కల్పిస్తామన్న పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ పార్శిల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌పీఎం) విధానం రైతులకు గుదిబండగా తయారైంది. ఒక భూ యజమానికి ఎన్ని సర్వే నంబర్లలో భూములు ఉన్నా ఒకే ఎల్‌పీఎం పరిధిలోకి వస్తుంది. ఇటువంటి విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం, ఉమ్మడి జిల్లాలో రీ సర్వే సమగ్రంగా జరగకపోవటం, జరిగిన చోట ల్యాండ్‌ పార్శిల్స్‌ విస్తీర్ణం ఎక్కువ, తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రిజిస్ర్టేషన్స్‌ పరంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రైతులు ఇబ్బంది పడటంతో పాటు రిజిస్ర్టేషన్‌ శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ)

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంతో రైతులకు అవస్థలు

తగ్గిపోయిన రిజిస్ర్టేషన్లు.. పడిపోయిన ఆదాయం

కూటమి ప్రభుత్వం వచ్చినా ఎల్‌పీఎం కొనసాగింపుపై ఆందోళన

భవిష్యత్తులో కోర్టు కేసులకు ఊతం

శాశ్వత భూహక్కులు కల్పిస్తామన్న పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ పార్శిల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌పీఎం) విధానం రైతులకు గుదిబండగా తయారైంది. ఒక భూ యజమానికి ఎన్ని సర్వే నంబర్లలో భూములు ఉన్నా ఒకే ఎల్‌పీఎం పరిధిలోకి వస్తుంది. ఇటువంటి విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం, ఉమ్మడి జిల్లాలో రీ సర్వే సమగ్రంగా జరగకపోవటం, జరిగిన చోట ల్యాండ్‌ పార్శిల్స్‌ విస్తీర్ణం ఎక్కువ, తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రిజిస్ర్టేషన్స్‌ పరంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రైతులు ఇబ్బంది పడటంతో పాటు రిజిస్ర్టేషన్‌ శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఎల్‌పీఎం వల్ల జరుగుతున్న నష్టాలు ఇవీ..

రామయ్య అనే వ్యక్తి తన 10 ఎకరాల విస్తీర్ణంలో ఐదు ఎకరాల భూమిని సోమయ్య అనే వ్యక్తికి విక్రయించాలనుకున్నాడు. రిజిస్ర్టేషన్‌ చేసుకుందామని వెళితే వీలు పడటంలేదు. దీనికి కారణం ఎల్‌పీఎం నంబర్‌ ఆధారిత రిజిస్ర్టేషన్‌ విధానాన్ని కొనసాగించటం. ఎల్‌పీఎం నంబర్‌లో సబ్‌ డివిజన్లు జరిగితేనే రామయ్య అమ్మాలనుకుంటున్న ఐదు ఎకరాలకు రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది. సబ్‌ డివిజన్‌ చేసుకోవాలంటే 30 రోజుల సమయం పడుతుంది. ప్రభుత్వం మూడు రోజుల్లో చేయాలని నిర్దేశించినా రెవెన్యూ శాఖలో ఇది జరగాలంటే నెల రోజులు కాదు కదా మూడు నెలలు పట్టవచ్చు. దీని వల్ల సదరు రైతు సకాలంలో భూమిని అమ్ముకోలేపోతున్నాడు. ప్రజలకు పరోక్షంగా తీవ్ర ఇబ్బందులు తీసుకువస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

కృష్ణారావు అనే వ్యక్తి తన ఎల్‌పీఎం నంబర్‌ 10లోని తన 10 ఎకరాల భూమిలో ఐదు ఎకరాలను బ్యాంకుకు తనఖా పెట్టి రుణం తీసుకోవాలనుకున్నాడు. తీరా తనఖా రిజిస్ర్టేషన్‌ జరిగితే.. మొత్తం 10 ఎకరాలు బ్యాంకుకు తనఖా అయిపోయింది. గిప్ట్‌ డీడ్‌లు, సేల్‌ డీడ్లకు సబ్‌ రిజిస్ర్టార్లు కనీసం సబ్‌ డివిజన్‌ చేసుకోమని చెప్పటానికి అవకాశం ఉంది. తనఖా అగ్రిమెంట్లకు అయితే ఈ అవకాశం లేదు. దీంతో భారీసంఖ్యలో తనఖా రిజిస్ర్టేషన్లు ఆగిపోతున్నాయి.

ఒక గ్రామంలో 500 ఎల్‌పీఎం నంబర్లు ఉన్నాయనుకుందాం. ఇందులో ఎల్‌పీఎం నంబర్‌ 5లో రామయ్యకు ఎన్‌హెచ్‌-65 వెంబడి రెండు ఎకరాలు, దాని పక్కనే మరో రెండు ఎకరాలు, ఇంకో చోట ఎకరం ఉంది. భూ సేకరణ చేయాల్సి వస్తే ఒకే ఎల్‌పీఎం నంబర్‌ కింద మార్కెట్‌ విలువను అసె్‌సమెంట్‌ చేయటం జరుగుతుంది. విస్తరణకు హైవే పక్కన ఉన్న రెండు ఎకరాలకు రూ. కోటి నిర్ణయిస్తే.. ఎల్‌పీఎం నంబర్‌ పరిధిలోని మిగిలిన వాటికి కూడా పరోక్షంగా అదే విలువను నిర్ణయించినట్టు అవుతోంది. భవిష్యత్తులో భూ సేకరణ చేయాల్సి వచ్చినా, మిగిలిన భూములు కూడా తీసుకోవాల్సి వచ్చినపుడు ఎల్‌పీఎం నంబర్‌లో ఫలానా మార్కెట్‌ విలువ నిర్ణయించారని కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి.

ప్రతి ఏటా భూముల ధరలు నిర్ణయించాల్సిన సందర్భంలో కూడా సమస్యలు తప్పటం లేదు. ప్రభుత్వం కొత్తగా భూముల ధరలను నిర్దేశించమని చెబితే పరిస్థి ఏమిటో అర్థం కావటం లేదు. ఉమ్మడి జిల్లాలో రీ సర్వే సమగ్రంగా జరగలేదు. జాతీయ రహదారి - 16 పక్కన ఒక గ్రామంలో సర్వే జరిగింది. మరో గ్రామంలో సర్వే జరగలేదు. ఎల్‌పీఎం నంబర్ల ప్రాతిపదికన మార్కెట్‌ విలువలను పెంచితే.. వేర్వేరు చోట్ల ఉన్న భూములకు ఒకే విలువ నిర్ణయమవుతుంది. హైవే పక్కన ఉన్న భూమికి మరోచోట ఉన్న భూమికి కూడా ఒకే విలువ వర్తిస్తుంది.

రీ సర్వే అనంతరం వెంకట్రావు అనే రైతుకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణం 11 ఎకరాలుగా వచ్చింది. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో 10 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ తప్పులు సరికాకపోవటం వల్ల వెంకట్రావు దగ్గర 10 ఎకరాలే ఉన్నప్పటికీ ఆ భూమిని కొనుగోలు చేస్తున్న నారాయణరావు 11 ఎకరాలకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది. అలాగే సోమయ్య అనే రైతుకు 10 ఎకరాల భూమి ఉంటే సర్వే తర్వాత 9 ఎకరాలుగా ఉంది. దీంతో తన 10 ఎకరాలను అమ్ముకున్నా.. 9 ఎకరాలు మాత్రమే విక్రయించాల్సి వస్తోంది.

రిజిస్ర్టేషన్‌ ముందు సబ్‌ డివిజన్‌ జరిగినా .. ఆ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తయితే తప్ప ఆస్తి హక్కుల బదిలీ జరగవు. సబ్‌ డివిజన్‌ జరిగిన తర్వాత రిజిస్ర్టేషన్‌ జరగకపోతే .. ఆ ఎల్‌పీఎం నంబర్‌ సబ్‌ డివిజన్స్‌ రికార్డులలో జంక్‌ వ్యాల్యూగా ఉంటాయి.

సర్వే నంబర్‌ అనేది స్థిరమైన ది. భౌగోళిక కోఆర్డినేట్లతో చూస్తే అది ఎప్పుడూ మారదు. ఆస్తిని గుర్తించటం, దాని విలువను అంచనా వేయటం చాలా సులభంగా ఉంటుంది. ఎల్‌పీఎం అనేది డైనమిక్‌ ఎంట్రీగా ఉంటుంది. రిజిస్ర్టేషన్స్‌ విషయంలో భౌగోళిక స్థానాన్ని అందించదు. సర్వే నంబర్‌ విధానంలో మార్పులు ఉండవు. అదే ఎల్‌పీఎం నంబర్‌ ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. దీని వల్ల నిషేధిత భూములను గుర్తించటం కష్టమౌతోంది.

Updated Date - Nov 11 , 2024 | 01:25 AM