ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala: నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే వెన్నుపోటు.. జగన్‌పై మంత్రి ఫైర్

ABN, Publish Date - Dec 06 , 2024 | 02:42 PM

Andhrapradesh: రాష్ట్రంలో అంబేద్కర్ ఆశ‌యాల‌ను తూచా త‌ప్పకు డా అమ‌లు చేస్తున్న పార్టీ టీడీపీ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దేశంలో మొద‌టి సారిగా ద‌ళిత వ్యక్తి జీఎంసీ బాల‌యోగిని లోక్‌స‌భ స్పీక‌ర్‌గా, ప్రతిభా భార‌తిని శాస‌న స‌భ స్పీక‌ర్‌గా చేసిన ఘ‌న‌త టీడీపీదే అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా దళిత బిడ్డ కాకి మాధ‌వ‌రావును, ఎస్సీ క‌మీష‌న్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్యను నియ‌మించ‌డం ద్వారా అంబేద్కర్ స్పూర్తితో నాడు చంద్రబాబు ప‌ని చేశారని వెల్లడించారు.

Minister Nimmala Ramanaidu

విజ‌య‌వాడ‌, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) రక్తదానం చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశ‌యాల‌ను తూచా త‌ప్పకు డా అమ‌లు చేస్తున్న పార్టీ టీడీపీ అన్నారు. దేశంలో మొద‌టి సారిగా ద‌ళిత వ్యక్తి జీఎంసీ బాల‌యోగిని లోక్‌స‌భ స్పీక‌ర్‌గా, ప్రతిభా భార‌తిని శాస‌న స‌భ స్పీక‌ర్‌గా చేసిన ఘ‌న‌త టీడీపీదే అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా దళిత బిడ్డ కాకి మాధ‌వ‌రావును, ఎస్సీ క‌మీష‌న్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్యను నియ‌మించ‌డం ద్వారా అంబేద్కర్ స్పూర్తితో నాడు చంద్రబాబు ప‌ని చేశారని వెల్లడించారు.

నిన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. నేడు ఎలన్‌ మస్క్


నేష‌న‌ల్ ఫ్ట్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ ఉండ‌గానే అంబేద్కర్‌కు భార‌త‌ర‌త్న ఇచ్చి గౌర‌వించారన్నారు. గ‌త తెలుగుదేశం హ‌యాంలో ఎస్సీ స‌బ్ ప్లాన్‌ను స‌మర్ధవంతంగా అమ‌లు చేస్తే, గ‌త వైసీపీ పాల‌న‌లో ఎస్సీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను కూడా దారి మ‌ళ్ళించారని మండిపడ్డారు. ‘‘నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ 27 ద‌ళిత స్కీమ్స్‌ను ర‌ద్దు చేసి ద‌ళితుల‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక ద‌ళిత వ్యక్తిని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి, ఇంటికి డోర్ డెలివ‌రీ చేస్తే, అత‌నికి స‌న్మానం చేసిన ఘ‌నుడు జ‌గ‌న్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దెబ్బకు దెబ్బ తీసిన స్టార్క్


‘‘నా తండ్రి పేరుపై పాలకొల్లులో 101 సార్లు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ధర్మారావు ఫౌండేషన్ పేరిట 24 సార్లు రక్తదానం చేశాను. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అని తెలిపారు. గత ఐదేళ్లలో దళిత స్కీమ్‌లను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. దళితుల ద్రోహి వైఎస్ జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దళితులకు పార్లమెంట్లో , అసెంబ్లీలో ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీనే అని గుర్తుచేశారు. ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు..

భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 02:57 PM