AP Assembly: సభలో జగన్‌పై విరుచుకుపడ్డ విష్ణుకుమార్ రాజు
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:40 PM
Andhrapradesh: ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నత కాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. ‘‘1983 నుండి నేను కాంట్రాక్టు చేస్తున్నాను. జగన్ పెట్టిన బాధలకు నేను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి’’ అంటూ విష్ణుకుమార్ రాజు తెలిపారు.
అమరావతి, నవంబర్ 16: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (MLA Vishnukumar Raju) మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి, బ్యాంక్‌లు అప్పులు ఇవ్వక చనిపోయారన్నారు.
YCP: వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా..
ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నత కాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘1983 నుండి నేను కాంట్రాక్టు చేస్తున్నాను. ఇంత దుర్మార్గమైన, రాక్షస రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, జగన్ ప్రభుత్వం దగ్గర చేయలేదు. జగన్ పెట్టిన బాధలకు నేను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. ఐదు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతికిన వ్యక్తిని. ఈ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అని ఎదురు చూస్తున్న... పిలిపించండి. 2019-24 వరకు రాక్షస పాలన జరిగింది’’ అంటూ విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడ్కో హౌసింగ్ పై లఘు చర్చను విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. జగన్ చేసిన దోపిడీకి సంబంధించిన అంశంపై.. వైసీపీ నేతలు తాను చెప్పేది వింటే సిగ్గుతో చస్తారన్నారు. ప్రధాని ప్రతి ఇంటికి లక్షన్నర సబ్సిడీ ఇస్తాము అని చెప్పాక.. ఏపీకి 7 లక్షల 1 వెయ్యి 400 ఇళ్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. 5 లక్షలు ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వడంతో పాటు ఏపీ ప్రభుత్వం లక్షన్నర్ సబ్సిడీ ఇచ్చి టీడ్కో ద్వారా చేశారన్నారు.
5 లక్షలు ఇళ్లలో 4 లక్షల 54 వేల 706 ఇల్లకు టెండర్‌లు పిలిచారన్నారు. 3 లక్షలు 13 వేలు ఇళ్లు గ్రాంట్ అయితే.. నా ఎస్సీలు, బీసీలు అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక 2 లక్షల 38 వేల 360 ఇళ్లు క్యాన్సిర్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ మారాక కాంట్రాక్టర్‌లకు పేమెంట్‌లు ఆపేశారని విష్ణుకుమార్ రాజు సభలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
AAdireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్
AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..
Read Latest AP News ANd Telugu News
Updated Date - Nov 16 , 2024 | 01:48 PM