ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత: ధూళిపాళ్ల

ABN, Publish Date - Mar 24 , 2024 | 12:24 AM

మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత అని మారిస్‌ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధిపతి డాక్టర్‌ ధూళిపాళ్ల రామకృష్ణ అన్నారు.

మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత: ధూళిపాళ్ల

వన్‌టౌన్‌, మార్చి 23: మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత అని మారిస్‌ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధిపతి డాక్టర్‌ ధూళిపాళ్ల రామకృష్ణ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా పరిరక్షణ అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగువారు తమ జీవన విధానం కోసం భాషను వదులుకుంటున్నారని అది సరైనది కాదని చెప్పారు. ఎక్కడ ఉన్నా భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భాష పట్ల గౌరవం ఉండాలని, నా భాష చాలా గొప్పదనే భావనతో ముందుకు సాగాలని పేర్కొ న్నారు. భాష పట్ల విద్యార్థులు ప్రేమను పెంచుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధి అవకాశాల కోసం ఆంగ్లంపై పట్టు సాధించినా మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే.రామకృష్ణ, తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ జీ.నాగరాజు, అధ్యాపకులు ఆర్‌ జితేంద్రకుమార్‌, వెన్నపూస పవన్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:24 AM

Advertising
Advertising