ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvaneshwari: వికలాంగులు, సామాన్య ప్రజలు ఒక్కటే

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:45 PM

Andhrapradesh: ప్రపంచంలో 100 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని.. అందులో రెండున్నర కోట్ల మంది భారతదేశంలో ఉన్నారని నారా భువనేశ్వరి తెలిపారు. ప్రభుత్వాలు ఇవి గుర్తించి వికలాంగుల కోటా, పెన్షన్‌లు వంటివి ఇస్తున్నాయన్నారు. చాలామంది దివ్యాంగులు.. సహాయంతో తమను తాము నమ్ముకుని గొప్పస్థాయికి వెళ్లారని తెలిపారు. అలాగే ఏం తీసుకోకుండా పట్టుదలతో, నిరూపించుకోవాలని కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పారు.

Nara Bhuvaneshwari

‌హైదరాబాద్/అమరావతి, డిసెంబర్ 3: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రై సైకిల్స్‌ను భువనేశ్వరి పంపిణీ చేశారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. ప్రపంచంలో 100 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని.. అందులో రెండున్నర కోట్ల మంది భారతదేశంలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఇవి గుర్తించి వికలాంగుల కోటా, పెన్షన్‌లు వంటివి ఇస్తున్నాయన్నారు. చాలామంది దివ్యాంగులు.. సహాయంతో తమను తాము నమ్ముకుని గొప్పస్థాయికి వెళ్లారని తెలిపారు. అలాగే ఏం తీసుకోకుండా పట్టుదలతో, నిరూపించుకోవాలని కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పారు.


ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు..

కొంతమంది పుట్టుకతో మరికొందరు కొంతమంది ప్రమాదాల వల్ల దివ్యాంగులు అవుతారన్నారు. వికలాంగులు, సామాన్య ప్రజలు ఒక్కటే అని తెలిపారు. అందరూ అందరిని ఆదరించుకోవాలని.. ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ను చంద్రబాబు..‌ నందమూరి తారకరామారావు పేరుతో ప్రారంభించారని తెలిపారు. మనవసేవే మాధవ సేవ అని ఎన్టీఆర్ నమ్మారని.. దాన్నే ట్రస్ట్ ఆచరిస్తుందని తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో అది అందించడంలో ముందు ఉంటామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.


సీఎం చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు...

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. దివ్యాంగులకు మొదలటి నుంచి టీడీపీ అండగా ఉంటోందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘ఆత్మవిశ్వాసాన్ని అణువణువునా నింపుకుని అందరితో సమానంగా ముందడుగేస్తోన్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేం బలంగా నమ్ముతాం. అందుకే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోంది. దివ్యాంగుల కోసం మూడు చక్రాల మోటారు వాహనాలు, స్వయం ఉపాధి పొందేందుకు రూ.1 లక్ష సబ్సిడీతో రుణాలు అందించి వారికి అండగా నిలిచాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ ను రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచి ఇస్తున్నాం. దేశంలో దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పడానికి నేను చాలా సంతోష పడుతున్నాను. అవరోధాలను, సవాళ్లను అధిగమించి....మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఎక్స్‌లో చంద్రబాబు పోస్టు చేశారు.

షుగర్‌ని నేచురల్‌గా ఇలా కంట్రోల్ చేయండి..


దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటాం: లోకేష్

‘‘ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు చాటుతున్న విభిన్న ప్రతిభావంతులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోంది. త్రిచక్ర మోటారు వాహనాలు, ఆర్థిక ఆసరా అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పింఛన్ రూ.6000 కు పెంచాం. దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటాం. అవకాశాలు అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 04:57 PM