నరకోత్తారక క్షేత్రం..నడకుదురు
ABN, Publish Date - Oct 31 , 2024 | 01:40 AM
నాటి నరకాసురసంహారానికి వేదిక నడకు దురు పృధ్వీశ్వర క్షేత్రం. నరకోత్తారక క్షేత్రంగా భాసిల్లుతున్న నడకుదురు తొలుత నరకొత్తూరు, నరకదూరుగా కాలక్రమంలో నడకుదురుగా రూపాం తరం చెందింది.
నాటి నరకాసుర సంహారం పృధ్వీశ్వర క్షేత్రంలోనే..
(ఆంధ్రజ్యోతి-చల్లపల్లి): నాటి నరకాసురసంహారానికి వేదిక నడకు దురు పృధ్వీశ్వర క్షేత్రం. నరకోత్తారక క్షేత్రంగా భాసిల్లుతున్న నడకుదురు తొలుత నరకొత్తూరు, నరకదూరుగా కాలక్రమంలో నడకుదురుగా రూపాం తరం చెందింది. నరకాసురుడిని సంహరించిన శ్రీకృష్ణసత్యభామలు కృష్ణా నదీ తీరాన పిండతర్పణాలు వదిలి, పాటలీవనంలో విశ్రాంతి తీసుకుని శ్రీలక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రక కథనం. దేవలోకం లోని పాటలీవృక్షాలు నడకుదురులో మినహా మరెక్కడా లేకపోవటం చారి త్రక ఆధారాలకు నిదర్శనం. స్వయంభువుగా పృధ్వీశ్వరస్వామి ఉద్భవించా రు. నడకుదురు క్షేత్ర మహాత్యాన్ని స్కంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో ప్రస్తావించినట్లు పండితులు పేర్కొంటున్నారు. శ్రీకృష్ణుడు సంచరించండం, కృష్ణానదిలో స్నానమాచరించి పాటలీవనంలో విశ్రాంతి పొందటం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పృధ్వీశ్వరక్షేత్రానికి వస్తారు. స్వామిని దర్శించుకుని ఉసిరి వనంలో వనసమారాధనలు జరుపుకొంటారు. నాదెళ్లవారిపాలేనికి చెందిన మండవ రవీంద్ర ఐదంతస్థుల రాజగోపురాన్ని నిర్మించి, భారీ నంది విగ్ర హాన్ని ఏర్పాటుచేసి దేవతామూర్తులు, పాటలీవనంలో అష్టాదశ శక్తి పీఠా లు, ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా దేవతామూర్తులను ప్రతిష్ఠించడంతో క్షేత్రం నిత్య నూతన శోభతో విరాజిల్లుతోంది.
పృధ్వీశ్వర క్షేత్రంలో నరకాసుర దహనం
చల్లపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పృధ్వీశ్వర క్షేత్రంలో నరక చతుర్ధశిని పురస్కరించుకుని నాటి నరకాసుర సంహారాన్ని నేటితరానికి తెలియజేసేలా బుధవారం రాత్రి నరకాసురవధ కార్యక్రమం నిర్వహించారు. నరకాసురుని పోలిన గడ్డి బొమ్మపైకి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నిప్పు వెలిగించిన బాణాన్ని వదిలారు. తొలుత బుద్ధప్రసాద్- విజయలక్ష్మి దంపతులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వేదపండితులు కంఠం రాజు సాయి దీక్షితులు నేతృత్వంలోని పురోహిత బృందం ఎమ్మె ల్యేకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
Updated Date - Oct 31 , 2024 | 07:11 AM