CPI: బెయిల్‌పై సుధీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్: నారాయణ
ABN, Publish Date - Feb 15 , 2024 | 01:35 PM
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదముందని ఒకవైపు దేవుళ్ళను పూజిస్తూ.. మరోవైపు రైతులను హింసిస్తోందని ఆరోపించారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదముందని ఒకవైపు దేవుళ్ళను పూజిస్తూ.. మరోవైపు రైతులను హింసిస్తోందని ఆరోపించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి జగన్ బానిస కాబట్టి.. అతని జోలికి ప్రధాని పోలేదన్నారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు అడారని, భారత దేశ చరిత్రలో బెయిల్‌పై సుధీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు.
17ఏ కేసు పెండింగ్‌లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రానికి దాసోహం అంటున్నారని. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని నారాయణ విమర్శించారు. కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే.. ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారన్నారు. ఫిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అని అనడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశావా.. చెప్రాసీ నౌకరీ చేశావు? అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ బాగా తెలివైనదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐకి అప్పగించాలని కోరుతోందని, సీబీఐకి కేసు అప్పగిస్తే.. మ్యానేజ్ చెయ్యాలి అనుకుంటోందని, బీజేపీ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. వేల కోట్ల అవినీతికి కేసీఆర్ బాధ్యుడని అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీష్ రావు అనడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ నేతలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నారని, రెండు నెలలు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట అని సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Updated Date - Feb 15 , 2024 | 01:36 PM