ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు

ABN, Publish Date - Dec 18 , 2024 | 07:49 AM

నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో పెనుతుపాను రేపుతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ నాయకులను బూతులు తిట్టి.. కేసులతో వేధించి.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలకు ఈ కార్యక్రమంలో పెద్ద పీట వేయడమే కాకుండా వారితో కలిసి వేదిక పంచుకోవడం తమ్ముళ్ల ఆగ్రహావేశాలకు కారణమైంది.

కృష్ణా జిల్లా: నూజివీడు (Nuzvidu) గౌతు లచ్చన్న (Gauthulachanna) విగ్రహావిష్కరణ (Statue unveiling)లో కొత్త నిజాలు (Facts) వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం (TDP), జనసేన పార్టీ (Janasena) వర్గాల నేతలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల వివిరాలతో పూర్తి స్థాయి నివేదిక తీసుకుని పరిశీలిస్తున్నారు. ఆ రోజు వేదికపై జనసేన జెండాపై గతంలో మూత్రం పోసిన బెజవాడ హర్ష, టీడీపీ శ్రేణులను కేసులతో వేధించిన ఆరేపల్లి రాంబాబు, గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన అనగాని రవి, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నూజివీడు వైఎస్సార్‌సీపీ నేత ఇంటీలో భేటీ అయ్యారు. జోగి రమేష్‌తో కొనకళ్ళ బ్రదర్స్ భేటీ జరిగిందంటూ పార్టీ వర్గాలకు సమాచారం అందింది. ఈ నివేదికను చూసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరును ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించారు.


లచ్చన్న విగ్రహావిష్కరణలో అంతా వారే..

కాగా నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో పెనుతుపాను రేపుతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ నాయకులను బూతులు తిట్టి.. కేసులతో వేధించి.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలకు ఈ కార్యక్రమంలో పెద్ద పీట వేయడమే కాకుండా వారితో కలిసి వేదిక పంచుకోవడం తమ్ముళ్ల ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంపై మరిన్ని విషయాలు సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం మొత్తం జోగి రమేశ్‌ను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నంగానే ఉందంటూ పలువురు టీడీపీ మద్దతుదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అధికశాతం వైసీపీ నాయకులు కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌తోపాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన ఘటనలో కీలక సూత్రధారి వైసీపీ నేత వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు అనగాని రవి, ఎన్నికలకు ముందు జనసేన జెండాపై మూత్రం పోసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై బూతులతో విరుచుకుపడిన ఆగిరిపల్లి మండల వైసీపీ నాయకుడు బెజవాడ హర్ష, నూజివీడు మండలంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానంటూ ప్రగల్బాలు పలికి టీడీపీ నాయకులను దొంగ కేసులతో వేధించిన నూజివీడు వైసీపీ నేత ఆరేపల్లి రాంబాబు ఇలా వేదికపై ఉన్నవారంతా కరుడుగట్టిన వైసీపీ నాయకులే కాకుండా ఏదో ఒక సమయంలో టీడీపీపై పరిధిదాటి ప్రవర్తించడం గమనార్హం. పైగా వేదికపై నుంచి జోగి రమేశ్‌ ప్రసంగిస్తూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం టీడీపీ నాయకులను తీవ్ర అసహనానికి గురి చేసింది.


కార్యక్రమానికి ముందు వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లో భేటీ

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముందు నూజివీడు వైఎస్సార్‌సీపీ నేత మారగాని నారాయణ ఇంట్లో గౌతు శిరీషతోపాటు కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య జోగి రమేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేశ్‌ తనయుడిపై ఉన్న అగ్రి గోల్డ్‌ కేసు చర్చకు వచ్చినట్టు సమాచారం. కేసుల రగడ నుంచి తనను బయటవేయాలని ఆయన టీడీపీ నేతలను కోరినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం బెజవాడ హర్ష ఇంట్లో నాయకులందరూ భోజనాలు చేశారు. ఆ సందర్భంలో అనగాని రవి తనపై కేసులు పెట్టి జైలుకు పంపారని, ఏదో విధంగా తనను బయటపడేయాలని నాయకులను కోరగా, జోగి రమేశ్‌ జోక్యం చేసుకుని జైలుకు వెళితే నీవు కూడా గౌతు లచ్చన్న అంత గొప్ప నాయకుడివి అవుతావంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అక్కడున్న నాయకులే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు

వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు

రోగుల చెంతకే వైద్య సేవలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 18 , 2024 | 08:58 AM