ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Floods: 30 గంటల తర్వాత గుడ్‌న్యూస్.. రాకపోకలు మొదలు

ABN, Publish Date - Sep 02 , 2024 | 08:33 PM

ఏపీలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఎంతలా అస్తవ్యస్తం చేశాయో తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎంతగానో ఇబ్బందిపడ్డారు. వరదల రోడ్లపైకి రావడంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 30 గంటల తర్వాత ఉపశమనం దక్కింది. రాకపోకలు పునరుద్ధరణ జరిగింది.

అమరావతి: ఏపీలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఎంతలా అస్తవ్యస్తం చేశాయో తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎంతగానో ఇబ్బందిపడ్డారు. వరదల రోడ్లపైకి రావడంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 30 గంటల తర్వాత ఉపశమనం దక్కింది. రాకపోకలు పునరుద్ధరణ జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఒక్కొకటిగా వాహనాలను అధికారులు అనుమతి ఇస్తున్నారు. గడిచిన 30 గంటలుగా జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచి ఉండడంతో అధికారులు అనుమతి ఇస్తున్నారు.


సహాయక చర్యలు ముమ్మరం

ఇబ్రహీంపట్నం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముమ్మరం చేశారు. జలదిగ్బంధంలో ఉన్న పెర్రీ, జూపూడి, మూలపాడు, కోటికలపూడి, గ్రామాలకు ఆహారం, మంచినీళ్లు అందరికీ అందాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి ఆహార పొట్లాలని బోట్లలో తీసుకుని వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 09:17 PM

Advertising
Advertising