ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఒక అరెస్టు ప్రభుత్వాన్నే కూల్చేసింది..

ABN, Publish Date - Sep 09 , 2024 | 11:34 AM

అమరావతి: ఒక అరెస్టు ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజల్లో ఆ అరెస్టు తిరుగుబాటును తీసుకువచ్చింది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ బేధం లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తింది. చివరకు అరెస్టు చేసిన రాజకీయ పక్షానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసింది. ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో..

అమరావతి: ఒక అరెస్టు ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజల్లో ఆ అరెస్టు తిరుగుబాటును తీసుకువచ్చింది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ బేధం లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తింది. చివరకు అరెస్టు చేసిన రాజకీయ పక్షానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసింది. ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో.. ప్రజల్లో తిరుగుబాటు వస్తే పాలక పక్షాలను ఎల మట్టి కరిపిస్తారో చూపించిన అరెస్టు అది. అదే నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు. చంద్రబాబు (Chandrababu) అరెస్టు జరిగి ఏడాది పూర్తవుతుంది. సెప్టెంబర్ 9ని తలచుకుంటే వైసీపీ నేతల (YCP Leaders) గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టే పరిస్థితి.


జగన్ (Jagan) లండన్‌లో ఉండగా చంద్రబాబును ఎత్తేసారంటూ అరెస్టు చేసిన విషయంపై వ్యంగ్యంగా మాట్లాడిన నాటి ముఖ్యమంత్రి జగన్‌కు నేడు అదే లండన్ వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం ప్రయత్నించడం దేవుడు రాసిన స్క్రీఫ్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై వ్యంగ్యంగా, వెకిలిగా మాట్టాడిన జగన్‌కు ప్రజలు అదేస్థాయిలో బుద్ది చెప్పారు. లేని, రాని, రికార్డుల్లోకనిపించని.. అసలు జరగని డబ్బు చంద్రబాబు తీసుకుంటున్నట్లుగా ఆరోపించడమేకాక.. కేసు నమోదు చేసి స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్టు చేసి నేటికి ఏడాది పూర్తి అవుతోంది. సెప్టెంబర్ 9న ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో చంద్రబాబును అరెస్టు చేసేందుకు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన హైడ్రామ ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 54 రోజులపాటు జైల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కట్టడి చేసిన వైసీపీ ప్రభుత్వంపై అదే స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పగ తీర్చుకున్నారు. చంద్రబాబు పడుకున్న బస్సు డోర్‌ను కొట్టి అరెస్టు చేసిన వైనం నేటికీ కళ్లముందు కనిపిస్తోంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.


10వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చడం.. ఆ తర్వాత ఆయన రిమాండ్‌పై జరిగిన వాదనల సమయంలో చంద్రబాబు కోర్టు వెలుపల కూర్చోని ఆలోచన చేస్తున్న దృశ్యం ఇప్పటికీ కంటతడి పెట్టిస్తోంది. ప్రజల్లో చర్చకు కూడా దారితీసింది.


జైల్లో బాబు ఆరోగ్య సమస్యలు..

జైల్లో చంద్రబాబుకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టడానికి కూడా ఆయన పార్టీకి చెందిన నేతలు పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలకుతోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలువాసం గడపడం ఇదే ప్రథమం. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలోని ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు ఆయనను అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయానికి బాటలు వేసింది. అప్పటికే పతన దిశలో ఉన్న వైసీపీ మరింత వేగంగా పతనమై అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీ అధినేత జగన్‌కు అసెంబ్లీలో విపక్ష నేతహోదా కూడా లభించలేదు. ఈ పరిణామాలన్నింటి వెనుక చంద్రబాబు అరెస్టు కీలక పాత్ర పోషించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


టీడీపీ దూకుడుకు భయపడి..

లోకేశ్‌ పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర వంటి కార్యక్రమాలతో నాడు టీడీపీ దూసుకుపోయింది. ఈ దూకుడును తగ్గించడానికి చంద్రబాబు అరెస్టు ఉపకరిస్తుందని వైసీపీ నాయకత్వం ఆలోచన చేసింది. కానీ తుది ఫలితం వేరుగా వచ్చింది. ఈ అరెస్టు జన సామాన్యంలో చంద్రబాబు పట్ల సానుభూతి పెల్లుబుకడానికి దారితీసింది. ఆయన జైలు నుంచి విడుదలైన రోజు రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా, స్వాగతం పలకడానికి దారి పొడవునా ప్రజలు వేల సంఖ్యలో ఎదురుచూశారు. విజయవాడ నగరంలో తెల్లవారుజామున చలిలో కూడా మహిళలు, యువత ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన అరెస్టుకు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడానికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలకడానికి దారితీసింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్థిరపడ్డ అన్ని దేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. ఒక్క అమెరికాలోనే ఎనభై నగరాల్లో ప్రదర్శనలు జరిగాయని అంచనా. ఏభైకు పైగా దేశాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయని టీడీపీ ప్రవాసాంధ్ర విభాగం నమోదు చేసింది.


జైలులోనే పొడిచిన పొత్తు...

చంద్రబాబు అరెస్టు అనేక రాజకీయ పరిణామాలకు దారితీసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్లి... తాము, టీడీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ పార్టీలతో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. బీజేపీ తటస్థంగా ఉంటుందని ఆశించిన వైసీపీకి ఆశాభంగం మిగిలింది. అరెస్టు జరిగిన ఏడాది తర్వాత చూస్తే... చంద్రబాబు జనంలో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. విజయవాడను వరద ముంచెత్తడంతో చంద్రబాబు తాత్కాలికంగా తన కార్యక్షేత్రాన్ని విజయవాడకు మార్చుకొని పనిచేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం జనంలో ఉంటున్నారు. విదేశాలకు వెళ్లాలని అనుకొన్న జగన్‌కు కోర్టు నుంచి అనుమతులు రాకపోవడంతో, ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు ఉంటుంది. దిగిపోయిన తర్వాత దానిని వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. సాధారణ పాస్‌పోర్టు కొత్తగా ఆయనకు ఐదేళ్ల కాల వ్యవధికి ఇవ్వాలని కింది సీబీఐ కోర్టు ఆదేశించింది. దానిని ఏడాదికి మాత్రమే మంజూరు చేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్‌ హైకోర్టుకు వెళ్లారు. ఈ నెల మూడో తేదీనే లండన్‌ వెళ్లాలని అనుకొన్న ఆయన.. కోర్టు వ్యవహారం తేలకపోవడంతో ఎదురుచూపుల్లో ఉన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 02:43 PM

Advertising
Advertising