ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Andhra Pradesh: జగన్ కోసం రంగంలోకి బంధువు? ఒక్కో పాస్టర్‌కు రూ. 4 వేలు..!?

ABN, Publish Date - Jan 31 , 2024 | 07:15 PM

Andhra Pradesh CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది.

Andhra Pradesh CM YS Jagan

విజయవాడ, జనవరి 31: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా విమలా రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో పాస్టర్ల భేటీ జరిగిందని తెలుస్తోంది.

ఈ భేటీలో రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఎందుకు గెలిపించాలి అనే అంశంపై పాస్టర్లతో చర్చలు జరిపారు. జగన్, ఆయన తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని, వారి కోసం ప్రార్థనలు చేయాలని విమలా రెడ్డి కోరారు. జగన్‌ను గెలిపించకపోతే క్రైస్తవులకు ఇబ్బందులు ఎదురవుతాయని విమలా రెడ్డి చెప్పారు. జగన్ సీఎం అయితేనే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆ సమావేశంలో వక్తలు చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఒక్కో పాస్టర్‌కు రూ. 4 వేల కవర్ చేతిలో పెట్టారు నిర్వాహకులు. దారి ఖర్చుల కింద ఉంచుకోవాలని చెప్పారు.

కాగా, ఈ ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లంకా దినకర్.

Updated Date - Jan 31 , 2024 | 07:15 PM

Advertising
Advertising