ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Pension: ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్.. లబ్దిదారుల్లో ఆనందం

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:46 AM

Andhrapradesh: జోరు వానలోనూ నేతలు పెన్షన్లను లబ్దిదారులకు అందజేస్తున్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్న విధంగానే ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, ఆయా వ్యాధుల చేత బాధింపబడేవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు ఏర్పాట్లు చేశారు.

AP Pension

అమరావతి, నవంబర్ 30: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫించన్ల పంపిణీ (AP Pension) జోరుగా సాగుతోంది. రేపు(డిసెంబర్ 1) ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఫించన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయ్యింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఫించన్ల పంపిణీలో పాల్గొని లబ్దిదారులకు ఫించన్లను అందజేస్తున్నారు. పలు చోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ ఫించన్ల పంపిణీ మాత్రం ఆగడం లేదు.

లగచర్ల భూములపై మరో ట్విస్ట్


జోరు వానలోనూ నేతలు పెన్షన్లను లబ్దిదారులకు అందజేస్తున్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్న విధంగానే ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, ఆయా వ్యాధుల చేత బాధింపబడేవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. అయితే శనివారం పెన్షన్‌ పొందని వారికి డిసెంబరు 2న అందజేయనున్నారు.


జోరువానలో...

అనకాపల్లి జిల్లా నర్సీ పట్నంలో ఫించన్ పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. జోరువానలోనూ స్పీకర్ పెన్షన్‌ను పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం ఏటిగైరంపేట గ్రామంలో ఒకరోజు ముందుగా ప్రభుత్వం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాల్గొని లబ్దిదారులకు డబ్బులు అందజేశారు.


ఆ తేడాలను గమనించండి: ఎమ్మెల్యే కందికుంట

అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పెన్షన్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకటో తేదీ ముందే పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన ఉన్న దేశ చరిత్రలో ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల తేడాలను గమనించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏదో జరిగిపోతుందని అపోహ కల్పిస్తున్నారని అన్నారు. ఉదయం 9 గంటలకే 90% పెన్షన్లను పంపిణీ పూర్తి చేశారన్నారు. సామాజిక పెన్షన్లు టీడీపీ ఆవిర్భావం నుండే మొదలయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్య కందికుంట వెంకటప్రసాద్ వెల్లడించారు.


పేదల సంక్షేమానికే పెద్దపీట: మంత్రి కొల్లురవీంద్ర

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఏప్రిల్, మే, జూన్ నెలల పించన్లు కలిపి జులై మొదటి తారీఖునే అందజేశామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఫించన్లు అందిజేస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఫించన్ల పంపిణీ అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.


జగన్‌పై కన్నా విమర్శలు..
అటు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 31వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులతో కలసి ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ హయాంలో పెన్షన్లు పెంచుతామని పెంచలేదని విమర్శించారు. పథకాలను వెంటనే అమలు చేస్తున్నది ఎన్డీయే ప్రభుత్వమని కన్నా లక్ష్మీ నారాయణ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గందరగోళం.. వార్డెన్‌ సస్పెండ్

షాకింగ్.. మళ్లీ పంజుకున్న బంగారం, వెండి ధరలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 12:47 PM