భక్తిశ్రద్ధలతో పోలిస్వర్గం
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:13 AM
కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా మార్గశిర శుద్ధ పాఢ్యమి సోమవారం పోలి స్వర్గం నోముల కార్యక్రమాన్ని పలు గ్రామాల్లోని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
కూచిపూడి/పామర్రు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా మార్గశిర శుద్ధ పాఢ్యమి సోమవారం పోలి స్వర్గం నోముల కార్యక్రమాన్ని పలు గ్రామాల్లోని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పంట కాలువలు, చెరువుల వద్ద అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని మహిళలు కాల్వల్లో వదిలారు. పోలిని స్వర్గానికి సాగనంపారు. కొండిప్రరు రోడ్డులోని పామర్రు పుల్లేటి రేవు వద్ద వేకువజామునే అధిక సంఖ్యలో భక్తులు పుల్లేటిలో స్నానాలు అచరించారు. శివాలయంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. కూచిపూడి, చిన్నముత్తేవి, గూడపాడు, మొవ్వ, కాజ, కోసూరు, నిడుమోలు, పెదపూడి గ్రామాల్లో శివాలయాల్లో అభిషేకాలు, విశేష పూజలు జరిపారు.
Updated Date - Dec 03 , 2024 | 01:13 AM