ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీజిల్‌ పోసి తగలెడతా!

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:03 AM

తీసుకున్న బయానా డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు కీసర గ్రామానికి చెందిన వైసీపీ నేత జడ్పీటీసీ ప్రశాంతి భర్త వేల్పుల రమేశ్‌ తనపై డీజిల్‌ పోసి నిప్పంటించేందుకు యత్నించాడని కీసర గ్రామానికి చెందిన బాధితుడు అంగిరేకుల రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీ్‌సస్టేషన్‌లో బాధితుడు, తల్లి

  • బయానా సొమ్ము అడిగినందుకు వైసీపీ నేత బెదిరింపులు

  • ప్రాణహాని ఉందని పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

కంచికచర్ల రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న బయానా డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు కీసర గ్రామానికి చెందిన వైసీపీ నేత జడ్పీటీసీ ప్రశాంతి భర్త వేల్పుల రమేశ్‌ తనపై డీజిల్‌ పోసి నిప్పంటించేందుకు యత్నించాడని కీసర గ్రామానికి చెందిన బాధితుడు అంగిరేకుల రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొలం కొనుగోలు చేసేందుకు ఆరేళ్ల క్రితం బాధితుడు రమేశ్‌ను సంప్రదించగా ఆయన బంధువుల పొలాన్ని చూపి బయానాగా రూ.5.5 లక్షలు ఇప్పించాడు. తర్వాత పలుమార్లుగా రూ.11.75 లక్షలు తన వద్ద తీసుకున్నాడని బాధితుడు వాపోయాడు. పొలం రిజిస్ట్రేషన్‌ చేయించాలని రమేశ్‌ను అడగ్గా కాలయాపన చేస్తున్నాడని, దీనిపై పొలం అమ్మకందార్లను సంప్రదించగా రమేష్‌ ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ములు తమకు ఇవ్వలేదని యజమానులు తెలపడంతో మోసపోయానని గ్రహించి ఇచ్చిన బయానా సొమ్మును తిరిగి ఇవ్వాలని రమేశ్‌ను అడగ్గా వాయిదా వేస్తున్నాడే తప్ప సొమ్ములు ఇవ్వలేదన్నాడు. పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టినా ఫలితం లేదన్నాడు. మంగళవారం రాత్రి తనను ఇంటికి పిలిచి తీవ్ర ఆగ్రహంతో ‘నీకెంత ధైర్యంరా నాపైనే పంచాయతీ పెడతావా’.. అంటూ బెదిరించి డీజిల్‌ పోసి తగలెడితే ఎవరు నిన్ను కాపాడతారో చూస్తా.. అని బెదిరించడంతో భయంతో 100కు ఫోన్‌ చేశానని, కానిస్టేబుల్‌ వచ్చి స్టేషన్‌కు తీసుకువచ్చారని పేర్కొన్నాడు. జరిగిన ఘటనపై లిఖిత పూర్వకంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేల్పుల రమే్‌షపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:03 AM