సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:44 AM
సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద సోమవారం ఆశ వర్కర్లు ధర్నా చేశారు.
మచిలీపట్నం టౌన్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంచాలి. విధి నిర్వహణలో మృతిచెందిన వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలి. కుటుంబ సంక్షేమ అధికారులు, యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలపై వెంటనే జీవోలు విడుదల చేయాలి.’ అని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద సోమవారం వారు ధర్నా చేశారు. సీఐటీయూ నాయకులు టి.చంద్రపాల్, సుబ్రహ్మణ్యం ధర్నాకు మద్దతు తెలిపారు. కొత్త రికార్డులు ఏప్రిల్ 1 నుంచి నిర్వహించాల్సి ఉన్నా, ఇప్పటి వరకు సరఫరా చేయలేదని, ఫీల్డ్ వర్కర్ల సెల్‌ఫోన్లు సరిగా పనిచేయడం లేదని, ఇబ్బంది పడుతున్నారని ఆశ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జి.చిట్టికుమారి తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు ఆశ వర్కర్లు వినతి పత్రం సమర్పించారు. ప్రధాన కార్యదర్శి పి.ధనశ్రీ, వై.నాగలక్ష్మి, వి.స్వరూపరాణి పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 01:44 AM