రైల్వే రక్షణ ‘కవచ్’
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:11 AM
ఒకే ట్రాక్‌పైన ఎదు రెదురుగా వచ్చే రైళ్ల ప్రమాదాలను నివారించటం, వెనుక నుంచి రైళ్లు ఢీకొనటం, అతివేగం కారణంగా పట్టాలు తప్పటం, ఎదురుగా వచ్చే వాటిని ఢీకొనాల్సిన పరిస్థితుల్లో ప్రమాదాలను నివారించే వ్యవస్థ ఈ ‘కవచ్’.
ప్రయాణికుల భద్రతకు పటిష్ట వ్యవస్థ
దక్షిణ మధ్య రైల్వేలో విజయవంతంగా అమలు
మెయిన్ లైన్‌లో విజయవాడ డివిజన్ అత్యంత కీలకం
విజయవాడ డివిజన్‌లో అమలు చేసేదెప్పుడు?!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రైలు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్య. ఒకే లైనుపై రెండు రైళ్లు ఎదురెదు రుగా దూసుకురావటం వల్ల జరుగుతున్నవే 99 శాతం మేర ఉంటు న్నాయి. రైలు పట్టాలు తప్పినా ప్రమాదాలు జరుగుతాయి కానీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎల్‌హెచ్‌బీ భోగీల కారణంగా పట్టాలు తప్పినా అవి బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి. ఒకే ట్రాక్‌పై ఎదురె దురుగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చే రైళ్లు ఢీ కొన్నప్పుడు మాత్రం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అయినా కూడా ప్రయాణికులు చనిపోతున్నారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అనేవి కేవలం పట్టాలు తప్పితే వాటిని బ్యాలెన్స్ చేయటా నికే పరిమితమవుతున్నాయి. ఒకే ట్రాక్ మీదకు వచ్చే ప్రమాదాలను నియంత్రిం చగలిగితే తప్ప ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకే ట్రాక్ మీదకు రైళ్లు ఎందుకు వస్తాయంటే సిగ్నలింగ్ సమస్యలు వచ్చినపుడే జరుగు తుంది. మాన్యు వల్‌గా ఇచ్చే సిగ్నల్స్‌లో ఏమాత్రం పొరపాటు జరిగినా ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో తక్కువ దూరంలో మరిన్ని సిగ్నల్స్ ఏర్పాటు, ఆటో మేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చాలా వరకు సత్ఫలితాలు ఇస్తున్నా.. ఇటీవల కాలంలో చెన్నైలో జరిగిన ప్రమాదంతో ఇంకా పటిష్టమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ’కవచ్’ను దక్షిణ మధ్య రైల్వే అధికా రులు విజయవంతంగా పరీ క్షించారు. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు దూసుకువస్తుంటే ఈ వ్యవస్థ వల్ల పైలట్లతో సంబంధం లేకుండా రైలు వేగాన్ని తగ్గించేసి వాటిని నిలుపుదల చేస్తుంది. ఇదెలా సాధ్యమవుతుంది? దీని సాంకేతిక విధానాలేమిటో చూద్దాం..
కవచ్ అంటే ఏమిటి?
కవచ్‌ను యాంటీ కొలిజన్ సిస్టమ్ అని కూడా పిలు స్తారు. రైళ్ల భద్రతను పెంచటానికి పూర్తి స్వదేశీ సాంకే తిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఒకే ట్రాక్‌పైన ఎదు రెదురుగా వచ్చే రైళ్ల ప్రమాదాలను నివారించటం, వెనుక నుంచి రైళ్లు ఢీకొనటం, అతివేగం కారణంగా పట్టాలు తప్పటం, ఎదురుగా వచ్చే వాటిని ఢీకొనాల్సిన పరిస్థితుల్లో ప్రమాదాలను నివారించే వ్యవస్థ ఈ ‘కవచ్’. ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌లు, జీపీఎస్ - జీఎస్‌ఎం కమ్యూని కేషన్స్ మిళితంగా ‘కవచ్’ వ్యవస్థ ఆధారపడి పని చేస్తుంది.
‘కవచ్’ పనిచేసే విధానం
‘కవచ్’ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే లోకో పైలట్ల ఇంజిన్ చాం బర్‌లో ప్రత్యేకమైన కవచ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టలేషన్ చేస్తారు. ట్రాక్ వెం బడి ఉన్న ప్రతి రైల్వేస్టేషన్‌లో కూడా కవచ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టలేషన్ చేస్తారు. ట్రాక్ పొడవునా టెలి కమ్యూనికేషన్ టవర్లను నెలకొల్పుతారు. ట్రాక్‌ల వెంబడి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను అమర్చుకుంటూ వెళతారు. ఈ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఒకే ట్రాక్‌లో నిర్ణీత సమ యంలో ఎదురెదురుగా రైళ్లు వస్తుంటే చాలా దూరం నుంచే కవచ్ పసిగట్టి వెంటనే లోకో పైలట్లకు వీడియో, ఆడియోతో కూడిన ప్రమాద సంకేతాలను అందిస్తుంది. ఒక వేళ లోకో పైలట్ ప్రతిస్పందించకపోతే కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. వెంటనే రైళ్ల వేగాన్ని తగ్గిం చేస్తుంది. రైళ్ల మధ్య దూరాన్ని లెక్కించుకుని బ్రేకింగ్ దూరాన్ని అం చనా వేస్తుంది. వెంటనే బ్రేకింగ్ చేయటం ద్వారా రెండు రైళ్లను నిలుపు దల చేస్తుంది. రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు ఎప్పటి కప్పుడు కవచ్‌కు వాటి స్థితిగతుల గురించి సమాచారాన్ని ఇస్తాయి. దీంతో రియల్ టైమ్ డేటా ఆధారంగా కవచ్ పనిచూస్తూ రైళ్లను ఢీకొన కుండా నియంత్రిస్తాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమలు
కవచ్ వ్యవస్థను మొదటి సారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. కవచ్ వ్యవస్థ అమల్లో ఉన్న ట్రాక్‌లలో ప్రమాదాలు దాదాపుగా తగ్గా యి. సమయపాలనతో రైళ్లు నడుస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గు తున్నాయి.
విజయవాడకు కవచ్ అవసరం!
దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ మీదుగా రోజూ ప్రయాణికులు, సరకు రవాణాకు 450 రైళ్లు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో మెయిన్‌లైన్ నౌపాడ వరకు ఉంది. విజయవాడ-విశాఖప ట్నం, విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు, విజయవాడ- తిరు పతి, విజయవాడ-గూడూరు, విజయవాడ-కాజిపేట సెక్షన్ల మధ్య రైళ్లు కిటకిటలాడుతుంటాయి. విజయవాడ మీదుగా ముంబాయి, ఢిల్లీ, పాట్నా, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నా యి. తీవ్రరద్దీ కూడలి విజయవాడ డివిజన్‌లో భవిష్యత్తు ఉపద్రవాలను నివారించాలంటే కవచ్ వంటి వ్యవస్థ అవసరం.
Updated Date - Nov 15 , 2024 | 01:11 AM