ABV: నేనేంటో చూశావ్.. నోరు అదుపులో పెట్టుకో.. జగన్‌కు ఏబీవీ హెచ్చరిక
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:12 PM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ జగన్ నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్న ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏబీవీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి, నవంబర్ 21: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(Former CM YS Jaganmohan Reddy) రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు (Retired DG AB Venkateswara Rao) సీరియస్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఏబీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మిస్టర్ జగన్ రెడ్డి...నోరు అదుపులో పెట్టుకో... మాట సరి చేసుకో... భాష సరి చూసుకో. ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా... ఒకసారి నోరు జారినా... వాటిని తిరిగి ఎన్నటికీ పొందలేరు. నీ లా కుసంస్కారంతో నేను మాట్లాడను.. తెర వెనుక బాగోతాలు నడుపను. నేనేంటో.. నా తలవంచని నైజం ఏమిటో గడచిన ఐదు ఏళ్లలో నువ్వే చూశావ్... బి కేర్ ఫుల్’’ అని ఏబీవీ హెచ్చరించారు. ‘‘ఫర్ ది రికార్డ్ అంటూ నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం’’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాగా.. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌లపై మాట్లాడిన ఆయన.. దీని వెనక ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్‌లు ఉన్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షకపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారిని అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. అలాగే అరెస్ట్‌లపై చంద్రబాబుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు సలహాలు ఇస్తున్నారన్నారు.
వారు నిరంతరం సచివాలయంలో తిష్ట వేసి ఉంటున్నారని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను ఉచ్చరించడమే కాకుండా.. వారికి ఏమాత్రం మార్యాద ఇవ్వకుండా ఏక వచనంతో సంభోదించారు జగన్. ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారులు అన్ని జిల్లాలలో వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టుల పర్వం సాగిస్తున్నట్లు జగన్ ఆరోపించారు. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్‌ల గురించి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అయితే జగన్ వ్యాఖ్యలపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Adani Group: అవినీతి ఆరోపణలు.. స్పందించిన అదానీ గ్రూప్స్..
కాగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల సర్కార్ ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. తన ఉద్యోగం కోసం న్యాయస్థానాలకు వెళ్లి మరీ పోరాటం చేశారు ఏబీవీ. గత ప్రభుత్వంపై ఏబీ వెంకటేశ్వరరావు ఎప్పటికప్పుడు ధిక్కరాస్వరం వినిపిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు కూడా చేశారు. చివరకు ఉద్యోగం కోసం న్యాయస్థానంలో చివరి వరకు పోరాడి గెలిచారు. రిటైర్మెంట్ రోజే ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు.. అదే రోజు సాయంత్రం పదవీ విరమణ పొందారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి
షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు
Read latest AP News And Telugu News
Updated Date - Nov 21 , 2024 | 04:57 PM