ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:46 AM
కారుకు బస్సు అడ్డం వచ్చిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో గొడవపడి దాడిచేసిన వ్యక్తులపై ఆదివారం కృష్ణ లంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
వన్‌టౌన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కారుకు బస్సు అడ్డం వచ్చిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో గొడవపడి దాడిచేసిన వ్యక్తులపై ఆదివారం కృష్ణ లంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాపట్లకు చెందిన కోటే శ్వరరావు తెనాలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తు న్నాడు. ఆదివారం తెనాలిలో ప్రయాణికులను ఎక్కిం చుకుని విజయవాడ బయలుదేరాడు. విజయవాడ బస్‌స్టేషన్‌లోకి వెళుతుండగా దుర్గమ్మ గుడివైపు నుం చి అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు బస్సును ఢీకొ ట్టబోయింది. కారులో ఉన్న డ్రైవర్, మరో ఐదుగురు కారులో నుంచి దిగి బస్సును అడ్డుకుని, డ్రైవర్ కోటేశ్వరరావుతో గొడవపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేశారు. స్థానికులు వారిని పోలీసులకు అప్పగిం చారు. డ్రైవర్ కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దాడి చేసిన వారి వివరాలు తెలియరాలేదు. కారును పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన వారిలో కొందరు మద్యం తాగి ఉన్నట్లు సమాచారం.
Updated Date - Nov 18 , 2024 | 12:46 AM