సారథి అభిమానుల సంబరాలు
ABN, Publish Date - Jun 13 , 2024 | 12:56 AM
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నూజీవీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కళ్యాణ్ మంత్రిపదవులు లభించడం పట్ల ఉయ్యూరులో టీడీపీ, జనసేన పార్టీలు, పార్ధసారథి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఉయ్యూరు, జూన్ 12 : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నూజీవీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కళ్యాణ్ మంత్రిపదవులు లభించడం పట్ల ఉయ్యూరులో టీడీపీ, జనసేన పార్టీలు, పార్ధసారథి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకా రోత్సవ సమావేశంలో మంత్రులుగా పార్థసారథి, పవన్‌కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలను ప్రధానసెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో తిలకించి పెద్దఎత్తున టపాసులు కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. హుషారుగా కేరింతలు కొడుతూ సెంటర్‌లో సందడి చేశారు. కుటుంబరావు, సుబ్బారావు, టీడీపీ నాయకులు చిరంజీవి, నజీర్, ఆంజనేయులు తదితరులు సంబరాలు చేశారు.
Updated Date - Jun 13 , 2024 | 12:56 AM