ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెజవాడలో ‘సీ ఫ్యాన్స్‌’ దొంగ

ABN, Publish Date - Jun 23 , 2024 | 01:14 AM

సముద్రగర్భంలో 10 నుంచి 20 మీటర్ల లోతులో పరిశుభ్రమైన ప్రదేశంలో వివిధ వర్ణాల్లో నెమలి పురి విప్పినట్టుగా కనిపించే ఆకారాలవి. వీడియోలు, ఫొటోల్లో చూసిన వాళ్లంతా వాటిని సముద్రగర్భంలో పెరిగే మొక్కలు అనుకుంటారు. వన్యప్రాణి పరి భాషలో వాటిని సీ ఫ్యాన్స్‌గా వ్యవహరిస్తారు.

సముద్రగర్భంలో వన్యప్రాణుల స్మగ్లింగ్‌

ఫొటో ఫ్రేముల్లో అమర్చి లక్షలాది రూపాయలకు అమ్మకాలు

సీ ఫ్యాన్స్‌ ఇంట్లో ఉంటే కుబేరులవుతారని ప్రచారం

వీడియోల ఆధారంగా ట్రాప్‌ వేసిన డబ్ల్యూజేసీ

రూ.91.25 లక్షల వన్యప్రాణి సంపద స్వాధీనం

దేశంలోనే అతిపెద్ద స్మగ్లింగ్‌ అంటున్న అధికారులు

విజయవాడ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): సముద్రగర్భంలో 10 నుంచి 20 మీటర్ల లోతులో పరిశుభ్రమైన ప్రదేశంలో వివిధ వర్ణాల్లో నెమలి పురి విప్పినట్టుగా కనిపించే ఆకారాలవి. వీడియోలు, ఫొటోల్లో చూసిన వాళ్లంతా వాటిని సముద్రగర్భంలో పెరిగే మొక్కలు అనుకుంటారు. వన్యప్రాణి పరి భాషలో వాటిని సీ ఫ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. అంతరించిపోతున్న జాతి జాబి తాలో ఉన్న ఈ సీఫ్యాన్స్‌ ప్రాణులతోపాటు వన్యప్రాణుల శరీర భాగాలను ఫొటో ఫ్రేమ్‌లుగా తయారుచేసి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్న వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.91.25 లక్షల విలు వైన వన్యప్రాణి సంపదను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో వన్యప్రాణి సం పదను ఇంత పెద్దమొత్తంలో సీజ్‌ చేయడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. వివరాలను వైల్డ్‌లైఫ్‌ జస్టిస్‌ కమిషన్‌ ఇండియా హెడ్‌ ఎస్‌కేడీ నీ రజ్‌, ఎన్టీఆర్‌ జిల్లా అటవీశాఖాధికారి ఏవీఎస్‌ఆర్‌కే అప్పన్న, విజిలెన్స్‌ విభాగ డీఎఫ్‌వో రవిశంకర్‌శర్మ, విజిలెన్స్‌ విభాగ రేంజ్‌ అధికారి ఎం.శంకరయ్య శని వారం వెల్లడించారు. విజయవాడకు చెందిన ఎస్‌.శ్రీనివాసరావు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. మహారాష్ట్రలోని విద్యుత్‌ ప్లాంట్‌లో కొన్నాళ్లు పని చేశాడు. దాన్ని మూసేయడంతో తిరిగి విజయవాడకు చేరుకున్నాడు. అయ్యప్పనగర్‌లో అక్షయనిధి పేరుతో ఓ షాపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో అడవినక్క తోక, ఏనుగు తోక వెంట్రుకలతో తయారు చేసిన బ్రాస్‌ లెట్లు, సముద్రపు తేలు, పాములు విడిచిన చర్మం(కుబుసం), జింక చర్మం, సముద్రగర్భంలో పెరిగే సీ ఫ్యాన్స్‌ను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. సీ ఫ్యాన్స్‌ ఎండిపోయిన మొక్క మాదిరిగా మారిన తర్వాత ఫొటో ఫ్రేమ్‌లో అమర్చి అమ్ముతున్నాడు. ఒక్కో ఫ్రేమ్‌ను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్ర యుస్తున్నాడు. వాటి అమ్మకాలను పెంచుకోవడం కోసం యూట్యూబ్‌లో ఇంద్ర జాలం, మహాఇంద్రజాలం పేరుతో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నాడు.

ట్రాప్‌ ఇలా...

‘‘నేను ఈ వీడియోలో చూపిస్తున్న వాటిని విక్రయించడం చట్టరీత్యా నేరం. ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే సకల సిరిసంపదలు కలుగుతాయి. తక్కువ కాలంలోనే కుబేరవులతారు.’’ శ్రీనివాసరావు తీసిన వీడియోల్లో వ్యాఖ్యానం ఇది. ఈ వీడియోలు అంతర్జాలంలో హద్దులు దాటి వెళ్లాయి. సముద్రగర్భంలో ఉండే వన్యప్రాణుల స్మగ్లింగ్‌ జరుగుతుందని తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న కొందరు గుర్తించారు. ఈ సమాచారాన్ని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న వైల్డ్‌లైఫ్‌ జస్టిస్‌ కమిషన్‌కు అందజేశారు. ఈ కమిషన్‌ అధిపతి నీరజ్‌ ఆధ్వ ర్యంలో కొంతమంది కొద్దిరోజుల క్రితం విజయవాడకు చేరుకున్నారు. అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. అటవీ శాఖలో ఉండే విజిలెన్స్‌ విభాగ అధికారులు అక్షయ నిధి షాపు వద్ద రెక్కీ నిర్వహించారు. కొనుగోలుదారులుగా వెళ్లి బేరాలు మాట్లాడారు. షాపుతోపాటు గోడౌన్‌లో ఉన్న సరుకును పరిశీలించారు. వెంటనే శుక్ర వారం రాత్రి శ్రీనివాసరావును అరెస్టు చేశారు. అతడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని 39, 40, 43, 44, 55 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శనివారం కోర్టులో హాజరుపర్చగా శ్రీనివాసరావుకు రిమాండ్‌ విధించింది. అధికారుల విచారణలో అతడు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ సరుకును ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావని ప్రశ్నించగా వరంగల్‌ జిల్లా మేడారంలో నిర్వహించిన సమ్మక్క సారక్క జాత రలో కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. దీన్ని అటవీ అధికారులు విశ్వసించ డం లేదు. ఏడాదిన్నరగా ఈ వ్యాపారం చేస్తున్నట్టు వివరించాడు.

ఇదీ సీ ఫ్యాన్స్‌ చరిత్ర

సముద్రగర్భంలో బాగా అడుగుభాగాన అత్యంత పరిశుభ్రమైన ప్రదే శంలో పెరిగే ప్రాణులు సీ ఫ్యాన్స్‌. వాటి ముఖం నేలను తాకుతుంది. తల తర్వాత నుంచి పెరిగే శరీరంతా ఎదుగుతున్న మొక్కకు విస్తరించే కొమ్మల్లా ఉంటుంది. సంతానోత్పత్తిని పెంచుకుని ఉన్న ప్రదేశంలో చిన్న చిన్న కాల నీలను ఏర్పాటు చేసుకుంటాయి. సముద్రపు నీరు పరిశుభ్రంగా ఉన్న చోట, అలజడులు లేని ప్రశాంతమైన ప్రదేశంలో పెరుగుతాయి. సముద్ర మట్టా నికి 20 నుంచి 30 మీటర్ల లోతులో ఉంటాయి. వీడియోలు, ఫొటోల్లో మొక్కలా కనిపిస్తాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ 1లో చేర్చింది. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. వివిధ పరిమాణాల్లో ఉన్న సీఫాన్స్‌ను శ్రీనివాసరావు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సీ ఫాన్‌ వయస్సు 25 నుంచి 50 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఈ తరహా ప్రాణులు అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్ష్యదీప్‌, రామేశ్వరం, తుత్తుకూడి, శ్రీలంక, గుజరాత్‌ ప్రాంతాల్లో సముద్రగర్భంలో ఉంటాయి.

Updated Date - Jun 23 , 2024 | 01:14 AM

Advertising
Advertising