మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ !

ABN, Publish Date - Feb 11 , 2024 | 09:23 PM

గుడివాడ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్ వెనిగండ్ల రాము సమక్షంలో గుడ్లవల్లేరు మండల ప్రముఖులు, వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. డోకిపర్రు గ్రామ వైసీపీ మాజీ వైస్ సర్పంచ్ పురిటిపాటి సుబ్బారావు, ఆరుగురు పంచాయతీ సభ్యులు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

AP News: గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ !

గుడివాడ: గుడివాడ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్ వెనిగండ్ల రాము సమక్షంలో గుడ్లవల్లేరు మండల ప్రముఖులు, వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. డోకిపర్రు గ్రామ వైసీపీ మాజీ వైస్ సర్పంచ్ పురిటిపాటి సుబ్బారావు, ఆరుగురు పంచాయతీ సభ్యులు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వెనిగండ్ల రాము ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారంత టీడీపీలోకి వస్తున్నారని ఆయన అన్నారు. జగన్ రెడ్డి, కొడాలి నానిలకు ఓటమి ఖాయమనే విషయం అర్థమైందన్నారు. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తికి సీఎంగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సీఎంగా పనిచేసిన సమయంలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ, తెలుగుజాతికి మంచి పేరు, గౌరవం తీసుకొచ్చారే తప్ప, ఎప్పుడూ అపఖ్యాతి తీసుకురాలేదని ప్రస్తావించారు.

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశాడని, గుడివాడలో పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని వెనిగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్ బావుండాలన్నా, రాష్ట్రాభివృద్ధి తిరిగి గాడిలోపడాలన్నా టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిందేనని ఓటర్లను కోరారు.

Updated Date - Feb 11 , 2024 | 09:23 PM

Advertising
Advertising