ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోవులు, దూడల వధ నేరం

ABN, Publish Date - Jun 16 , 2024 | 01:02 AM

గోహత్య నిషేధ చట్టం అమలులో ఉం దని గోవులు, దూడలను వధిస్తే కేసులు నమోదు చేస్తామని, అధికారులు హెచ్చరించారు.

గోవధ నిషేధంపై పోస్టర్లు ఆవిష్కరిస్తున్న అధికారులు

14 ఏళ్లు దాటి వ్యవసాయానికి, బ్రీడ్‌ అభివృద్ధికి పనికిరాని ఎద్దు, దున్న, గేదెల వధకు పశువైద్యుడి అనుమతి తప్పనిసరి

కబేళాలోకి ఒక జంతువుతో ఇద్దరికి మాత్రమే అనుమతి

నగర వీధుల్లో పశువధ చేసి, మాంసం విక్రయిస్తే చర్యలు

బక్రీద్‌ సందర్భంగా మార్గదర్శకాల విడుదల

విద్యాధరపురం, జూన్‌ 15: గోహత్య నిషేధ చట్టం అమలులో ఉం దని గోవులు, దూడలను వధిస్తే కేసులు నమోదు చేస్తామని, అధికారులు హెచ్చరించారు. శనివారం భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులోని ఫంక్షన్‌ హాలులో ఈనెల 17వ తేదీన బక్రీద్‌ సందర్భంగా భారీగా జంతుబలులు ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ మార్గదర్శకాలను వివరిస్తూ భవానీ పురం పోలీస్‌స్టేషన్‌, శాంతి కమిటీల ఆధ్వర్యంలో గోరక్షణ సమితి సభ్యులు, ఆహార భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎద్దు, దున్న, గేదే వంటి వాటిని వధించాలంటే వాటి వయస్సు 14 ఏళ్లు దాటి ఉండాలని వ్యవసాయానికి, బ్రీడ్‌ డెవలప్‌మెంట్‌కు పూర్తిగా పనికిరాకపోతేనే వధించాలని, అందుకు ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికెట్‌ తీసుకుని, ప్రభుత్వ అనుమతి ఉన్న కబేళాలోనే వధించాలని సూచించారు. రోడ్లపైన, ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ పశువు లను వధించడం మాంసాన్ని విక్రయించడం నేరమని తెలిపారు. రెండేళ్ల లోపున్న, అనారోగ్యం సోకి ప్రమాదంలో మరణించిన పశువులను వధించరా దన్నారు. కబేళాలోకి ఒక జంతువును మాత్రమే తీసుకురావాలని దానితో పాటు ఒకరు లేదా ఇద్దరికి అనుమతి ఉంటుందని తెలిపారు. బక్రీద్‌ సందర్భంగా విజయవాడ వీధుల్లో పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బక్రీద్‌ సందర్భంగా పశువధ చేయడానికి విజయవాడ నగరపాలక సంస్థ కబేళాలో అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. అనధికార పశువధ జరగకుండా నగరపాలక సంస్థ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. డీసీపీ హరికృష్ణ, ఏసీపీలు మురళీకృష్ణారెడ్డి, రత్నరాజు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 01:02 AM

Advertising
Advertising