క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తా: సుజనా చౌదరి
ABN, Publish Date - Apr 29 , 2024 | 12:45 AM
క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తానని, వారి అభ్యున్నతికి పాటుపడతానని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
చిట్టినగర్, ఏప్రిల్ 28: క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తానని, వారి అభ్యున్నతికి పాటుపడతానని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆదివారం కలరా హాస్పిటల్ సమీపంలోని జోసఫ్ స్కూల్ చర్చి ప్రాంగణంలో ప్రార్థ నల్లో ఆయన పాల్గొన్నారు. పలువురు చర్చి పెద్దలతో మాట్లాడారు. గెలిచిన వెంటనే క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించి పశ్చిమ అభివృద్ధికి పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు. చర్చి నిర్వాహకుడు జహార్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2024 | 12:45 AM