ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ayyanna Patrudu: జగన్ కట్టించిన గోడ.. స్పీకర్ ఏం చేశారంటే..

ABN, Publish Date - Jul 18 , 2024 | 12:32 PM

అమరావతి: ఏపీ అసెంబ్లీకి ఉన్న రెండో గేటును స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెరిపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల కష్టాలు వినిపించకూడదని.. ఓ నియంతలా వ్యవహరిస్తూ.. అసెంబ్లీకి అడ్డుగోడ నిర్మించారు. అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ రెడ్డి రెండో గేటును మూసివేయించి అడ్డుగా గోడ నిర్మించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly)కి ఉన్న రెండో గేటు (Second Gate)ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayyanna Patrudu) తెరిపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల (Amaravati Farmers) కష్టాలు వినిపించకూడదని.. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తూ.. అసెంబ్లీకి అడ్డుగోడ నిర్మించారు. అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ రెడ్డి రెండో గేటును మూసివేయించి అడ్డుగా గోడ నిర్మించారు. దీంతో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోడానికి వీలు లేకుండా పోయింది. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకుని నాడు జగన్ కట్టిన అడ్డుగోడను తొలగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ గేట్లు తెరిచే ఉంచాలని, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ప్రజా ప్రభుత్వం అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.


ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. అయితే మూడు రోజుల పాటు ఈ అంసెబ్లీ సమావేశాలు జరగనున్నాయని సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక శ్వేత పత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి సయితం పచ్చ జెండా ఊపింది. అదే విధంగా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి సైతం మంత్రి వర్గం ఆమోదించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కూడా కేబినెట్ ఆమోదించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులకు రాజ్ తరుణ్ వివరణ

ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

జగన్ మార్క్ కొత్త దందా..

శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల నేడు..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 12:34 PM

Advertising
Advertising
<