ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme court: జగన్ కేసుల జాప్యంపై సుప్రీంకు సీబీఐ నివేదిక

ABN, Publish Date - Dec 13 , 2024 | 10:58 AM

Andhrapradesh: జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సీబీఐ, ఈడీ నివేదికలను సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత తీర్పు ఇస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.

Former CM YS Jaganmohan Reddy

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అక్రమాస్తులు, బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సీబీఐ, ఈడీ నివేదికలు దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత తీర్పు ఇస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.

Big Breaking: కేటీఆర్‌పై కేసు పెట్టేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..


జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ పిటీషన్‌పై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని గతంలో ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల స్టేటస్‌ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని గతంలో సీబీఐ, ఈడీలను ధర్మాసన ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈరోజు సీబీఐ నివేదికను దాఖలు చేసింది.


సీబీఐ అఫిడవిట్ ఇదే..

జగన్ కేసుల విచారణపై సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను సీబీఐ తన అఫిడవిట్‌లో పొందుపర్చింది. జగన్‌పై 11 అక్రమాస్తుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. 86 డిశ్చార్జ్ పిటీషన్లలో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ తేల్చలేదని అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ట్రయల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలతో సుప్రీంకు దర్యాప్తు సంస్థలు అఫిడవి‌ట్‌‌ను దాఖలు చేశారు. మొత్తం 120 మంది నిందితులపై ఛార్జిషీట్లను సీబీఐ, ఈడీ దాఖలు చేశాయి. ఇప్పటి వరకు 860 మంది సాక్షులను కోర్టు విచారించింది. ట్రయల్‌ కోర్టులో 11 కేసుల్లో 86 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయగా... అన్ని పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏ ఒక్క డిశ్చార్జి పిటిషన్‌లోనూ తుది తీర్పు వెలువరించలేదని.. తెలంగాణ హైకోర్టులో నిందితులు 40 పిటిషన్లు దాఖలు చేయగా... ఇంకా 27 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని... సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలు చేయగా... దానిలో 12 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది.


గత విచారణలో..

కాగా.. ఈ కేసుకు సంబంధించి గత విచారణలో కేసు పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే.జగన్ బెయిల్‌ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పిటీషన్‌పై డిసెంబర్ 2 జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేసు పురోగతితో పాటు.. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.


అలాగే రోజు వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ప్రశ్నించింది. డిశ్చార్జ్ పిటిషన్‌లకు సంబంధించిన విచారణ జరుగుతోందని అందుకే అక్కడ రోజువారీ విచారణకు ఆటంకం కలుగుతోందని జగన్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్‌లు వేశారని.. ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందని ధర్మాసనం మరో ప్రశ్న వేసింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించడంతో పాటు సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తులకు సంబంధించి పిటిషన్లు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై ఓ పట్టిక రూపంలో అఫిడవిట్‌లా ఇవ్వాలని.. దాన్ని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పిప్పటికీ విచారణ జరగడం లేదంటే దీనిపై ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడుతూ కేసు విచారణను నేటికి (డిసెంబర్ 13)కి వాయిదా వేసింది. ఈరోజు విచారణలో భాగంగా జగన్ కేసు జాప్యంకు గల కారణాలపై సీబీఐ, ఈడీ ఓ నివేదికను సుప్రీం ధర్మాసనానికి దాఖలు చేసింది.


రఘురామ పిటిషన్‌లో..

జగన్ అక్రమాస్తుల సంబంధించి సీబీఐ కోర్టులో విచారణ తీవ్ర జాప్యం జరుగుతోందని.. డిశ్చార్జ్ పిటిషన్‌ను పదేపదే వేస్తున్నారని రాఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈకేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తరువాత చివరి నిమిషంలో తీర్పు ఇవ్వాల్సి దశలో వారంతా ట్రాన్సఫర్ అవుతూ వచ్చారని తెలిపారు. అలాగే కొంతమంది రిటైర్డ్‌ అవుతున్నారని వెల్లడించారు. ఈ కారణంగా ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కృష్ణ ప్రధానంగా డిమాండ్. చేశారు. అలాగే జగన్ సాక్షాలను బెదిరిస్తున్నారని, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నందున ఆయనను అరెస్ట్ చేసి.. బెయిల్‌ను రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌లో కోరారు. ఈ కేసుపై సుప్రీం కోర్టులో అనేక సార్లు, అనేక బెంచ్‌ల ముందు విచారణకు వచ్చింది. ఈరోజు జస్టిస్ అభియ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.


ఇవి కూడా చదవండి..

పుష్ప సినిమా సీన్‌ను మించి స్కెచ్.. పోలీసులే షాక్..

సోది చెబుతానమ్మ..సోది..!

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 12:42 PM