AP News: డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులు.. టీడీపీ నేత ఏం చేశాడంటే
ABN, Publish Date - Nov 19 , 2024 | 03:54 PM
Andhrapradesh: ‘‘నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడంతో నా పై కేసులు పెట్టగా, జైలుకు కూడా వెళ్లివచ్చాను. ఇంకా కొంతమంది అప్పుల వాళ్లు మా ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారు. మా ఇంట్లో రాత్రిళ్లు పడుకుని.. పిల్లలను కూడా మానసికంగా ఇబ్బంది పెట్టారు. గత ఐదేళ్లల్లో 15 ప్రాపర్టీలు నేను ఇవ్వాల్సిన వారికి రిజిస్ట్రేషన్లు చేశాను’’.
విజయవాడ, నవంబర్ 19: అప్పులు బాధలు, వైసీపీ నేతల వేధింపుల కారణంగా గొల్లపూడిలో టీడీపీ నాయకుడు కారంపూడి రవీంద్ర ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన బాధను వివరిస్తూ వీడియోను విడుదల చేసి మరీ రవీంద్ర బవన్మరణానికి పాల్పడ్డాడు. 12 ఏళ్లుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని రవీంద్ర వీడియోలో తెలిపాడు. గత వైసీపీ ప్రభుత్వంలో తనకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అప్పులు కట్టకపోవడంతో జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు చెప్పాడు. అప్పులు వాళ్లు ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారని.. పిల్లలు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని అన్నాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా తన ఇబ్బందులు తీరలేదంటూ రవీంద్ర వీడియోలో వాపోయాడు.
HYDRA: అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక
వీడియోలో ఉన్నది ఇదే...
‘‘చాలా సంవత్సరాలుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. వైసీపీ ప్రభుత్వంలో నాకు రావాల్సిన డబ్బులు నాకు రానివ్వకుండా అడ్డుకున్నారు. నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడంతో నా పై కేసులు పెట్టగా, జైలుకు కూడా వెళ్లివచ్చాను. ఇంకా కొంతమంది అప్పుల వాళ్లు మా ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారు. మా ఇంట్లో రాత్రిళ్లు పడుకుని.. పిల్లలను కూడా మానసికంగా ఇబ్బంది పెట్టారు. గత ఐదేళ్లల్లో 15 ప్రాపర్టీలు నేను ఇవ్వాల్సిన వారికి రిజిస్ట్రేషన్లు చేశాను. ఒక ప్రాపర్టీ విషయంలో నన్ను బెదిరించి బలవంతంగా రిజిస్ట్రర్ చేయించుకున్నారు. 20లక్షల ఇవ్వాల్సి ఉంటే.. రెండు కోట్ల ప్రాపర్టీకి సంతకాలు చేయించుకుని లాక్కున్నారు. నేను పుట్టినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తగానే బతికాను. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా ఇబ్బందులు తీరలేదు. నాకు ఎవరూ సాయం చేసేలా కూడా కనిపించడం లేదు. అమెరికాలో ఉన్న నా బావమరిది వల్లే ఈ మూడేళ్లు ఇలా బతికి ఉన్నాం. గతంలో నా కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక నా భార్య, బిడ్డలను నా బావమరిది దగ్గరకు పంపాను. నేను కూడా వెళ్లిపోతానని నన్ను మరింత ఇబ్బందులు పెడుతున్నారు. నాకు ఇవ్వాల్సిన వాళ్లు డబ్బులు ఇవ్వడం లేదు.. నేను ఇవ్వాల్సిన వారు నాపై ఒత్తిడి చేస్తున్నారు. నాకు ఎవరూ బినామీలు లేరు.. నేను ఎవరినీ అడ్డం పెట్టుకుని బతకడం లేదు. టీడీపీ ప్రభుత్వం వస్తే సమస్యలు తీరతాయని ఈ మూడేళ్లు ఎన్నో అవమానాలు తట్టుకుని ఉన్నాను. కానీ ఇప్పటికీ కూడా నా సమస్యలు తీరే మార్గం కనిపించడం లేదు. నారా లోకేష్ దగ్గరకు ఒకావిడ వెళ్లి నేను డబ్బులు ఇవ్వాలని పిటిషన్ ఇచ్చారు. ఇక్కడి పోలీసుల దగ్గరకు పిటిషన్ వచ్చింది.. నేను వెళ్లి వాస్తవాలు చెప్పినా పోలీసులు కూడా వినడం లేదు. నా పేరుతో, మాకుటుంబం పేరుతో ఇప్పుడు సెంటు భూమి కూడా లేదు. నా దగ్గర అదనంగా రాయించుకున్న ప్రాపర్టీ వెనక్కి ఇస్తారని చూసినా ఎవరూ స్పందించలేదు. గొల్లపూడి టీడీపీ నేతలకు కూడా నా గురించి తెలుసు. నేను మోసం చేయలేదని బావిస్తే.. నా కుటుంబానికి కైనా న్యాయం చేయండి. వడ్లమూడి రాజేశ్వరి అనే మహిళ నుంచి నాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో నాకు చావే శరణ్యమని ఆత్మహత్య చేసుకుంటున్నాను. రవికి న్యాయం చేయాలనిపిస్తే.. ఆ డబ్బు రికవరీ చేసి అప్పుల వాళ్లకు కట్టండి. మిగిలితే నా భార్యా, పిల్లలకు ఇవ్వండి’’ వీడియోలో కారంపూడి రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రవీంద్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్
YS Sunitha: ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి
Real Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2024 | 03:54 PM