T.Highcourt: విజయసాయిరెడ్డిపై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:29 PM
Andhrapradesh: జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఐసీఏఐ సవాల్ చేసింది.
హైదరాబాద్/అమరావతి, నవంబర్ 21: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై (MP Vijayasaireddy) వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డిని విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది.
ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఐసీఏఐ సవాల్ చేసింది. వృత్తిపరమైన ప్రవర్తన నియమావలని ఉల్లఘించారని విచారణకు అనుమతి ఇవ్వాలని ఐసీఏఐ పేర్కొంది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా నోటీసులు రద్దు చేయడం సరైంది కాదని ఐసీఏఐ పేర్కొంది. ఒకే అంశంలో రెండు వేరు వేరు వ్యక్తుల పిటిషన్‌లను కలిపి లిస్ట్ చేయడంపై ఐసీఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను వేరుగా విచారణ చేయాలని కోర్టును ఐసీఏఐ కోరింది. దీనిపై విచారణ జరిపిని హైకోర్టు.. మరో పిటిషన్‌తో జత చేకుండా విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను విడిగా లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. తరుపరి విచారణ వచ్చే వారానికి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి
షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు
Read latest AP News And Telugu News
Updated Date - Nov 21 , 2024 | 12:46 PM