వైరానదిలో పడి వంటమాస్టర్ మృతి
ABN, Publish Date - Jul 09 , 2024 | 12:48 AM
మండలంలోని అనిగండ్లపాడు గ్రామానికి చెందిన వంటమాస్టర్ బోశెట్టి రమేష్(42) ప్రమాదవశాత్తు తెలంగాణ రాష్ట్రం మధిర శివారు సమీపంలోని వైరానదిలో పడి సోమ వారం మృతి చెందాడు.
పెనుగంచిప్రోలు, జూలై 8: మండలంలోని అనిగండ్లపాడు గ్రామానికి చెందిన వంటమాస్టర్ బోశెట్టి రమేష్(42) ప్రమాదవశాత్తు తెలంగాణ రాష్ట్రం మధిర శివారు సమీపంలోని వైరానదిలో పడి సోమ వారం మృతి చెందాడు. రమేష్ అనిగండ్లపాడులో గృహాన్ని నిర్మించు కుంటున్నాడు. సామాన్లు కొనుగోలు చేసేందుకు మధిర వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరాడు. శివాలయం ముందు వైరా నదిలో తాత్కాలికంగా వేసిన రహదారిపై వస్తుండగా మధ్యలోకి వచ్చే సరికి ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. దీంతో బైక్‌పై నుంచి కిం దకు పడిపోయాడు. వెంటనే తూములో ఇరుక్కుపోయాడు. ఊపిరి ఆడకపోవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న వారు వచ్చి పైకితీయగా, అప్పటికే మృతిచెందాడు. మధిర పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రమేష్ భార్య రాజేశ్వరి విజ యవాడ విద్యాధరపురం ఆర్టీసీడిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Updated Date - Jul 09 , 2024 | 12:48 AM