ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొత్త కలెక్టర్‌ డీకే బాలాజీ

ABN, Publish Date - Apr 05 , 2024 | 12:49 AM

కృష్ణాజిల్లా కలెక్టర్‌ (జిల్లా ఎన్నికల అధికారి)గా డీకే బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోగా పనిచేస్తున్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు

మచిలీపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లా కలెక్టర్‌ (జిల్లా ఎన్నికల అధికారి)గా డీకే బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పి.రాజాబాబును ఎన్నికల కమిషన్‌ బదిలీ చేయడంతో బాలాజీ నియామకం జరిగింది. బాలాజీ 2016లో కృష్ణాజిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. 2022లో జిల్లా విభజన జరగ్గా కృష్ణా కలెక్టర్‌గా రంజిత్‌బాషా ఏడాది పాటు పనిచేశారు. 2023, ఏప్రిల్‌ 15న కలెక్టర్‌గా పి.రాజాబాబు నియమితులయ్యారు. మూడు రోజుల క్రితం ఆయన బదిలీ అయ్యారు. కృష్ణాజిల్లా విభజన జరిగిన మూడో సంవత్సరం ప్రారంభం రోజే జిల్లాకు మూడో కలెక్టర్‌గా డీకే బాలాజీ నియమితులు కావడం గమనార్హం. బెంగళూరుకు చెందిన డీకే బాలాజీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఐఏఎస్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించారు. గతంలో ఈయన కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేశారు.

Updated Date - Apr 05 , 2024 | 12:49 AM

Advertising
Advertising