పాడిరైతుల సంక్షేమమే ధ్యేయం
ABN, Publish Date - Dec 06 , 2024 | 12:53 AM
వరదల కారణంగా యూనియన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాల సేకరణ ధర పెంచామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు.
పెడన/పెడన రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వరదల కారణంగా యూనియన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాల సేకరణ ధర పెంచామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. గుడ్లవల్లేరు క్లస్టర్ పరిధిలోని పాల సంఘాల అధ్యక్షులకు నడుపూరు పాల సం ఘంలో గురువారం రూ.60,23,326 బోనస్ చెక్కులను ఆయన అం దజేశారు. పశువులకు ఇన్సూరెన్స్, పాడి రైతులకు ఏసీపీ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామన్నారు. పాడి రైతులకు క్షీరబంధు, కల్యాణమస్తు, ప్రతిభ వంటి పథకాలు అమలుతో పాటు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తమ యూనియన్ ఆశయమని ఆంజనేయులు స్పష్టం చేశారు. యూనియన్ పాలక వర్గ సభ్యుడు అర్జా వెంకటనగేష్, గుడ్లవల్లేరు పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ తోట సత్యనారాయణ, పాల సంఘాల అధ్యక్షులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 12:53 AM