ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదేం పద్ధతి!

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:26 AM

మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా రోడ్డు కం రైలు మార్గాల కోసం భూములిచ్చిన పలువురు రైతుల సహనానికి అధికారులు పరీక్ష పెడుతున్నారు. రెండేళ్ల నుంచి నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా తిప్పుకొంటున్నారు. భూములు తీసుకునేటప్పుడు అందరికీ పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడేమో అనేక కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండానే తమ భూముల్లో రహదారి నిర్మా ణం కోసం మెరక చేశారని, దీంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. అధికారుల పద్ధతి సరికాదని పేర్కొంటున్నారు.

మచిలీపట్నం పోర్టు రోడ్డు కం రైల్‌ మార్గానికి రైతుల నుంచి భూమి సేకరణ

కొందరు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ.. మరికొందరికి పెండింగ్‌

రెండేళ్ల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణ జూ భూములు తీసుకునేటప్పుడు ఒక మాట.. తర్వాత మరో మాట అంటూ రైతుల ఆగ్రహం

మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా రోడ్డు కం రైలు మార్గాల కోసం భూములిచ్చిన పలువురు రైతుల సహనానికి అధికారులు పరీక్ష పెడుతున్నారు. రెండేళ్ల నుంచి నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా తిప్పుకొంటున్నారు. భూములు తీసుకునేటప్పుడు అందరికీ పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడేమో అనేక కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండానే తమ భూముల్లో రహదారి నిర్మా ణం కోసం మెరక చేశారని, దీంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. అధికారుల పద్ధతి సరికాదని పేర్కొంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంలో భాగంగా రోడ్డు కం రైలు మార్గం నిర్మాణం నిమిత్తం 270 ఎకరాలకుపైగా రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. మూడు విడతలుగా భూసేకరణ నోటిఫికేషన్లను జారీ చేశారు. కరగ్రహారం నుంచి మేకావానిపాలెం వరకు ముందస్తుగా భూములిచ్చిన రైతులకు అసైన్డ్‌ భూములకు ఎకరానికి రూ.31.25 లక్షలు చొప్పున, పట్టా భూములకు రూ.45 లక్షలు చొప్పున ధరగా నిర్ణయించారు. కొందరు రైతులకు నగదును కూడా జమచేశారు. మరికొందరు రైతులకు చెందిన పట్టాభూములు, అసైన్డ్‌భూములకు పత్రాలు సక్రమంగా లేవనే కారణంతో నగదు జమచేయలేదు. మంగినపూడిబీచ్‌ రోడ్డు వెంబడి పోర్టుకు సంబంధించిన పాత శిలాఫలకం వద్ద నుంచి సముద్రం వరకు రహదారిని నిర్మించారు. మంగినపూడి రోడ్డులోని పోర్టు పాత శిలాఫలకం నుంచి పోతేపల్లి వరకు 55 ఎకరాలను రోడ్డు కం రైలుమార్గం కోసం భూమిని కొనుగోలు చేశారు. ఇందులో రైతులకు చెందిన కొంత భూమికి నగదు చెల్లింపులు చేయలేదు. మచిలీపట్నం పోర్టు పనులను 2023 మే 22వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అంతకు పదిరోజుల ముందుగానే భూములిచ్చే రైతులతో రెండు విడతలుగా కలెక్టరేట్‌లో సమావేశాలు నిర్వహించి పోతేపల్లి ప్రాంతంలో రోడ్డు కం రైలు మార్గాలకు భూములిచ్చే రైతులకు ఎకరానికి రూ.45 లక్షలు చొప్పున ధర ఇస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. కరగ్రహారం, మేకావానిపాలెంలోని భూములు ఇచ్చిన రైతులకు అధిక రేటును పరిగణనలోకి తీసుకోకుండా, తక్కువ ధరను పరిగణనలోకి తీసుకోవడంతో తమ భూములకు తక్కువ ధరను నిర్ణయించారని రైతులు అభ్యంతరం చెప్పారు. పోతేపల్లి ప్రాంతంలోని భూములకు రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఉన్న భూముల ధరను పరిగణనలోకి తీసుకుని భూమి కొనుగోలు ధరను నిర్ణయించాలని రైతులు పట్టుబట్టారు. దీంతో దిగొచ్చిన రెవెన్యూ అధికారులు ఎకరానికి రూ.45 లక్షలకు బదులుగా రూ.55లక్షలు ఇస్తామని అంగీకరించారు. ఈ ధరకు తమ భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. అయితే కొంతమంది రైతులకు చెందిన భూములకు నగదు జమ చేసే సమయంలో భూములకు సంబంధించి పత్రాలు సక్రమంగా లేవని, వెబ్‌ల్యాండ్‌లో కనిపిస్తేనే సవరణలు చేస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలు చూపి తమకు నగదు జమ చేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు జేసీ దృష్టికి గతంలో తీసుకువెళ్లారు.

నగదు ఇవ్వాలని మీకోసంలో వినతి

మేకావానిపాలేనికి చెందిన దాసరి వెంకటపూర్ణచంద్రరావు, మేకా కృష్ణమ్మ, మేకా బాపనయ్యతో పాటు మరో ముగ్గురు రైతులు రోడ్డు కం రైలు మార్గం కోసం భూములు ఇచ్చామని.. తమకు నగదు ఇప్పించాలని కోరుతూ ఇటీవల ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీకోసం)కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించి రైతుల ఖాతాల్లో నగదు జమచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బాలాజీ ఆర్డీవోకు సూచించారు. రైతుల వద్ద ఉన్న అసలు పత్రాలు తీసుకురావాలని ఆర్డీవో కార్యాలయ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు భూములకు సంబంధించిన పత్రాలు ఆర్డీవో కార్యాలయంలో ఇచ్చామని, తాము వెళ్లిన ప్రతిసారి ఈ పత్రాలు కనపడటంలేదని ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే అధికారులు చెబుతూ తమను తిప్పుతున్నారే తప్ప, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

స్పష్టమైన హామీ ఇస్తేనే భూములిచ్చాం

గతంలో పనిచేసిన జేసీ అపరాజిత సింగ్‌ ఆర్డీవో, తహసీల్దార్‌, రిజిస్ర్టార్‌లతో రైతుల సమక్షంలో మాట్లాడి భూములిచ్చిన రైతులకు నగదు ఇచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించి నగదు ఇస్తామని స్పష్టంగా చెబితేనే తాము భూములు ఇచ్చేందుకు పత్రాలపై సంతకాలు చేశామని రైతులు అంటున్నారు. కలెక్టరేట్‌లోని ల్యాండ్‌ విభాగం అధికారులు మాత్రం భూమికి సంబంధించిన రికార్డులు, నగదు సిద్ధంగా ఉన్నాయని, మావద్ద పెండింగ్‌ ఏమీ లేదని చెబుతున్నారని రైతులు అంటున్నారు. కలెక్టరేట్‌లో సక్రమంగా ఉన్న భూమి రికార్డులు ఆర్డీవో కార్యాలయంలో కనపడకపోవడానికి గల కారణాలు ఏమిటో తమకు అర్థ్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి తమను ఆర్డ్టీవో వద్దకు వెళ్లనీయడం లేదని ఆరోపిసున్నారు. నగదు లేకుండా ఎక్కడి నుంచి మీ బ్యాంకు ఖాతాల్లో నగదు చేయాలని సంబంధిత అధికారి విసుక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు కం రైలు మార్గాల కోసం భూములిచ్చిన రైతులకు నగదు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 01:26 AM