ప్రమాదాలకు దారితీసేలా..
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:07 AM
ఏలూరు రోడ్డులోని ఈఎస్‌ఐ బస్టాండ్ సెంటర్ ప్రమాదాలకు నిలయంగా మారింది.
ఈఎస్‌ఐ సెంటర్‌లో రాంగ్‌రూట్‌లో వాహనాలు
(ఆంధ్రజ్యోతి-భారతీనగర్): ఏలూరు రోడ్డులోని ఈఎస్‌ఐ బస్టాండ్ సెంటర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. గుణదల నుంచి ఈఎస్‌ఐ రోడ్డులోకి ప్రయాణించాల్సిన వాహనదారులు ఈ సెంటర్ వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయి. గుణదల నుంచి ఈఎస్‌ఐ రోడ్డులోకి వెళ్లాల్సిన వారి కోసం ఏలూరు రోడ్డులో ఈఎస్‌ఐ బస్సు సెంటరుకు సమీపంలోని మోడల్ డెయిరీ ఎదురుగా మధ్యలో సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేశారు. ఈసెంటర్‌లో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు వాహనదారులు ఈ సెంటర్ ముందున్న డివైడర్ కటింగ్ ద్వారా రాంగ్ రూట్‌లో ఈఎస్‌ఐ రోడ్డులోని ప్రవేశిస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనదారు లను ఢీకొంటున్నారు. అఽధికారులు స్పందించి వాహనదారులు రాంగ్‌రూట్‌లో రాకుండా చూడాలని కోరుతున్నారు.
Updated Date - Nov 11 , 2024 | 01:07 AM