‘మధ్యవర్తిత్వం’పై న్యాయవాదులకు శిక్షణ
ABN, Publish Date - May 15 , 2024 | 12:43 AM
జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మధ్యవర్తిత్వం నెరపటంపై మంగళవారం సివిల్ కోర్టుల ప్రాంగణంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
జగ్గయ్యపేట, మే 14: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మధ్యవర్తిత్వం నెరపటంపై మంగళవారం సివిల్ కోర్టుల ప్రాంగణంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జగ్గయ్యపేట మేజిస్ట్రేట్‌లు శ్రావణి, శోభారాణి మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వ వహించాల్సివస్తుందని, దానిపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందర రావు, న్యాయవాదులు బి.వెంకటరామయ్య, పి.సత్యశ్రీనివాసరావు, ఎస్.నరసింహారెడ్డి,జె.శ్రీనివాసరావు, టి.ఎల్.నరసింహారావు శిక్షణ ఇచ్చారు.
ఎకరం మామిడితోట అగ్నికి ఆహుతి
సుమారు రూ.6 లక్షల నష్టం
జి.కొండూరు, మే 14: అగ్ని ప్రమాదంలో ఎకరం మామిడి తోట కాయలతోపాటు, పొలంలో ఉన్న టేకు చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గంగినేనిపాలెంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. బాధిత రైతు కుమ్మరి శివ రంగారావుకు చెందిన అరెకరం, తన సోదరి కానూరులో ఉంటున్న కొండపల్లి పద్మావతికి చెందిన అరెకరం మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్ వల్ల మంటలు వ్యాపించారు. ఈప్రమాదంలో సుమారు రూ.6 లక్షల వరకు నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు. కంచికచర్ల నుంచి అగ్నిమాపకశకటం వచ్చి మంటలను అదుపు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రైతులు వాపోయారు.
Updated Date - May 15 , 2024 | 12:43 AM