అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ బయాలజీపై రెండు రోజుల శిక్షణ
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:18 AM
సిద్ధార్ధ మహిళా కళాశాలలో మంగళవారం కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ర్టీ ఆధ్వర్యంలో పాస్టర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లేబొరేటరీ గుంటూరు సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ బయాలజీ అనే అంశంపై రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు.
అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ బయాలజీపై రెండు రోజుల శిక్షణ
లబ్బీపేట, నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి): సిద్ధార్ధ మహిళా కళాశాలలో మంగళవారం కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ర్టీ ఆధ్వర్యంలో పాస్టర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లేబొరేటరీ గుంటూరు సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ బయాలజీ అనే అంశంపై రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ ఎం.గురవయ్య మోల్‌క్యులరీ టెక్నాలజీ ప్రాముఖ్యతను, పీసీఆర్ టెక్నాలజీ, ఐసోలేషన్ ఆఫ్ డీఎన్‌ఏ, ప్లాస్‌నిడ్ డీఎన్‌ఏ తదితర అంశాలతో పాటు ఆకుల నుంచి ఐసోలేష్ చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మాధవి పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:18 AM