ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఏపీ, బిహార్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కేబినెట్

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:05 PM

అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ (గురువారం) కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పింది.

Narendra Modi

న్యూఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో గుడ్‌న్యూస్ చెప్పింది. అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. మొత్తం రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర రాజధాని అమరావతి కొత్త రైల్వే లైన్‌‌ను నిర్మించనున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ నిర్మించనున్నారు. ఈ లైన్‌ ద్వారా దక్షిణ భారతదేశాన్ని మధ్య, ఉత్తరాదితో అనుసంధానం చేయడం మరింత సులువు అవుతుంది.


అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి ఈ కొత్త రైల్వే లైన్ సులువైన మార్గంగా నిలుస్తుంది. మరోవైపు మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మాణం చేపట్టనుండడంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఈ లైన్‌ నిర్మాణం ద్వారా 19 లక్షల పనిదినాల ఉపాధి కల్పన జరుగుతుందని అంచనాగా ఉంది. ఈ లైన్‌ నిర్మాణంతో పాటు ఏకంగా 25 లక్షల చెట్లు నాటి కాలుష్య నివారణకు కూడా కేంద్రం చర్యలు చేపట్టనుంది.


తెలంగాణలో ఖమ్మం జిల్లాను కలుపుతూ..

కొత్తగా నిర్మించనున్న రైల్వే లైన్‌ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఉంటుంది. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించనున్నారు. తెలంగాణలో ఖమం జిల్లా, ఏపీలో ఎన్‌టీఆర్‌ విజయవాడ, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం జరగుతుంది.


బిహార్‌ కూడా తీపి కబురు

ఏపీతో పాటు బిహార్ రాష్ట్రానికి కూడా కేంద్ర కేబినెట్ కీలక రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి, బీహార్‌‌కు‌ రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను గురువారం ఆయన వెల్లడించారు. మొత్తం రూ.6,789 కోట్ల వ్యయంతో ఈ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని చెప్పారు.


ఏపీ రాజధాని అమరావతి అనుసంధానానికి 57 కిలోమీటర్లు మేర, బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రెండు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అన్నారు. ప్రతిపాదన కొత్త రైల్వే లైన్ అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పరుస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజల రవాణాకు మెరుగైన వ్యవస్థగా ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బహుళ-ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను సులభతరం చేయడమే కాకుండా రద్దీని తగ్గిస్తుందని అన్నారు.


నేను చెప్పిందే నిజమైంది.. జగన్‌పై అనిత కామెంట్స్

దసరా సెలవులు ఇవ్వమని అడగడమే ఆ బాలిక చేసిన నేరమా

Updated Date - Oct 24 , 2024 | 04:23 PM