Polavaram: పోలవరంపై కేంద్రం నుంచి తాజా అప్‌డేట్..
ABN, Publish Date - Dec 05 , 2024 | 03:52 PM
Andhrapradesh: చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తానని కేంద్రమంత్రి తెలిపారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటికే చాలా నిధులను అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నామన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పోలవరం ప్రాజెక్ట్‌పై (Polavaram Project) కేంద్రం (Central Govt) కీలక ప్రకటన చేసింది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (Union Minister CR Patil) తెలిపారు. పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తానని కేంద్రమంత్రి తెలిపారు.
Nadendla: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
పోలవరం నిర్మాణానికి ఇప్పటికే చాలా నిధులను అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నామన్నారు. ఢిల్లీలో గృహప్రవేశం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మీడియా ప్రతినిధులకు గురువారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రిమంత్రి ఈమేరకు ప్రకటన చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి లాంటిదని.. దీనిని 2027 నాటికి పూర్తిచేస్తామని ఢిల్లీలో కేంద్రమంత్రి తెలిపారు. కాగా జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభంకాబోతోంది. దీన్ని 2026 మార్చి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 70వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. గోదావరి -కృష్ణా- పెన్నా నదుల అనుసంధానం కూడా ఉండబోతోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగాయి. అయితే రివర్స్ టెంటర్ కారణంగా పదిహేడు నెలల పాటు నిలిచిపోయాయి. జగన్ పాలనలో ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగని పరిస్థితి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 71.93శాతం 2014-2019 మధ్య టీడీపీ హయాంలో పూర్తి అయితే.. ఆ తరువాత ప్రభుత్వ హయాంలో కేవలం 3.84 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని పార్లమెంటులో గణాంకాలను అందజేశారు.
2024-25లో రూ.12,500 కోట్లు నిధులపై కేంద్రం దృష్టిసారించింది. ఈ నిధులతో డయాఫ్రంవాల్‌తో పాటు పలు కీలకమైన పనులను పూర్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే గోదావరి -కృష్ణా- పెన్నా నదుల అనుసంధానం కూడా పూర్తి అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేది కేంద్రం మాట. పాత డయాఫ్రం వాల్ నష్టపోవడంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.1200 కోట్లు అవసరం అవుతాయని కేంద్రం అంచనా వేసింది. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం రూ.31,500 కోట్లు అవసరం అవుతాయని సర్కార్ నిర్ణయించింది. దాన్ని కూడా ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. వరదల సమయంలో నీటి లీకేజ్ ప్రధాన సమస్యగా ఉండటంతో దీనికి నూతన సాంకేతికతను ఉపయోగించనున్నారు. 2019- 24 మధ్య వైసీపీ హయాంలో ప్రాజెక్ట్ నిధులు సరైన విధంగా వినయోగించలేదని విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే కాకుండా 28.5 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. 960 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రయారిటీగా భావిస్తోంది.
ఇవి కూడా చదవండి...
పాకిస్తాన్ పేరు మార్చండి మహాప్రభో..!
AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 05 , 2024 | 04:09 PM